వీకెండ్లోనే మిలియన్ కొట్టేస్తున్నాడా?

వీకెండ్లోనే మిలియన్ కొట్టేస్తున్నాడా?

గత కొన్నేళ్లలో యుఎస్ మార్కెట్లో అనూహ్యమైన ప్రగతి సాధించిన టాలీవుడ్ హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా మారిన నాని.. తెలుగు రాష్ట్రాల్లో కంటే ముందే యుఎస్‌లో స్టార్ ఇమేజ్ సంపాదించడం విశేషం. ‘భలే భలే మగాడివోయ్’ కంటే ముందే నాని నుంచి వచ్చిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ యుఎస్‌లో అదరగొట్టింది. ఇక ఆ తర్వాత అక్కడ నాని సినిమాలు ఎలా దూసుకెళ్లాయో తెలిసిందే. కొందరు పెద్ద హీరోలకు కూడా కష్టంగా ఉన్న మిలియన్ డాలర్ మార్కును నాని చాలాసార్లు అలవోకగా అందుకున్నాడు. అతడి కొత్త సినిమా ‘జెర్సీ’ అలవోకగా ఆ మార్కును దాటేస్తోంది. వీకెండ్లోనే అది సాధ్యమైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

గురువారం ప్రిమియర్ల ద్వారా ‘జెర్సీ’కి 1.45 లక్షల డాలర్ల కలెక్షన్ వచ్చింది. మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం శుక్రవారం అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టింది. 2.6 లక్షల డాలర్లకు పైగా కొల్లగొట్టింది. దీంతో ప్రిమియర్లతో కలిపి తొలి రోజుకే 4 లక్షల డాలర్ల మార్కును దాటేసింది ‘జెర్సీ’. మామూలుగా శుక్రవారం కంటే శనివారం వసూళ్లు ఎక్కువగా ఉంటాయి. మినిమం మూడు లక్షల డాలర్లు గ్యారెంటీ అనుకోవచ్చు. ఆదివారం కూడా జోరు కొనసాగితే వీకెండ్లోనే మిలియన్ డాలర్ల క్లబ్బుకు ‘జెర్సీ’ చేరువగా వచ్చే అవకాశముంది. యుఎస్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గ వైవిధ్యమైన క్లాస్ సినిమా కావడంతో ఫుల్ రన్లో 1.5 మిలియన్ డాలర్ల మార్కును కూడా ‘జెర్సీ’ అందుకునే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English