బ్యాడ్ టాక్.. అయినా కలెక్షన్లు కుమ్మేసింది

బ్యాడ్ టాక్.. అయినా కలెక్షన్లు కుమ్మేసింది

కొన్ని సినిమాలకు టాక్‌తో సంబంధం ఉండదు. బ్యాడ్ టాక్ వచ్చినా సరే.. వసూళ్ల మోత మోగిపోతుంది. ప్రధానంగా మాస్ సినిమాలకే ఇలా జరుగుతుంటుంది. ఇప్పుడు రాఘవ లారెన్స్ చిత్రం ‘కాంఛన-4’ ఇలాగే బాక్సాఫీస్ దగ్గర మోత మోగిస్తోంది. నిన్న తమిళ, తెలుగు భాషల్లో రిలీజైన ఈ సినిమాకు టాక్ ఏమీ బాగా లేదు. ఎన్నో హార్రర్ కామెడీల్లో చూసిన వ్యవహారమే ఇందులోనూ కనిపించింది. ‘కాంఛన’ సిరీస్‌లో ఇంతకుముందు వచ్చిన సినిమాలు ఉన్నంత ఎఫెక్టివ్‌గా ఇది లేదు. అటు తమిళంలో, ఇటు తెలుగులో ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూలే వచ్చాయి. సోషల్ మీడియాలో జనాలు సైతం నెగెటివ్ కామెంట్లే వేస్తున్నారు సినిమా గురించి.

కానీ ప్రధానంగా మాస్ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసిన ఈ చిత్రం తొలి రోజు రెండు భాషల్లో కలిపి రూ.20 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం. తమిళనాడు వరకే రూ.10.6 కోట్ల గ్రాస్ సాధించిన ‘కాంఛన-4’.. తెలుగు రాష్ట్రాల్లో రూ.6 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. మిగతా ఏరియాల్లో వసూళ్లు రూ.2 కోట్లకు పైనే ఉన్నట్లు అంచనా. మొత్తంగా రూ.20 కోట్ల గ్రాస్‌తో సంచలనం సృష్టించిందీ సినిమా. ‘కాంఛన’ సిరీస్ మీద ప్రేక్షకులకు ఎంత గురి ఉందన్నది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మాస్ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు బాగా తగ్గిపోయాయి. అందుకే రివ్యూలు, టాక్ ఎలా ఉన్నప్పటికీ బి, సి సెంటర్ల ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎగబడుతున్నట్లు కనిపిస్తోంది. ఐతే వీకెండ్ తర్వాత ఈ సినిమాకు ఇదే ఊపు ఉంటుందా అన్నది సందేహం.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English