మజిలీలో తన బెస్ట్ సీనే లేపేశాడుగా..

మజిలీలో తన బెస్ట్ సీనే లేపేశాడుగా..

ఈ వేసవిలో టాలీవుడ్‌కు మంచి ఆరంభాన్నిచ్చిన సినిమా ‘మజిలీ’. రెండు వారాల కిందట విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుని.. వసూళ్ల విషయంలోనూ అదరగొట్టింది. వారం తిరక్కుండానే బయ్యర్ల పెట్టుబడిన వెనక్కి తెచ్చిన ‘మజిలీ’ రెండు, మూడు వారాల్లోనూ మంచి వసూళ్లతో సాగుతోంది. ఈ సినిమా ఫలితం పట్ల చాలా సంతోషంగా ఉన్న దర్శకుడు శివ నిర్వాణ.. ఎడిటింగ్ టైం కత్తెర వేసిన సీన్లను ఒక్కొక్కటిగా పంచుకుంటున్నాడు.

మొన్ననే సుబ్బరాజు-చైతూ కాంబినేషన్లో తెరకెక్కించిన ఒక హృద్యమైన సన్నివేశాన్ని షేర్ చేశాడు. తన భార్య శ్రావణి కారణంగా తనలో మార్పు వచ్చాక పూర్ణ.. సుబ్బరాజు దగ్గరికి వెళ్లి అతడికి షాకిచ్చే సీన్ అది. పూర్ణ దగ్గరికి వస్తుంటే తనను ఏమైనా చేస్తాడేమో అనిపించి కత్తి తీసుకుని.. పొడవడానికి సిద్ధ పడతాడు సుబ్బరాజు. కానీ అతను అతడిని కౌగిలించుకుని.. ద్వేషించే వాళ్లను కూడా ప్రేమించడం తన భార్య ద్వారా నేర్చుకున్నట్లు చెప్పి వెళ్లిపోతాడు. ఆ సీన్ సినిమాలో ఉంటే బాగుండేదని అనిపిస్తోంది జనాలకు.

ఇప్పుడు దీన్ని మించిన మరో మంచి సన్నివేశాన్ని శివ షేర్ చేశాడు. పూర్ణలో మార్పు వచ్చాక కూతురు, అల్లుడిని తన ఇంటికి భోజనం పెడతాడు పోసాని. అప్పుడు చైతూ ఆయన్ని మావయ్య అంటాడు. ఆ మాటతో చాలా ఉద్వేగానికి గురవుతాడు పోసాని. ఈ సీన్లో పోసాని నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మిగతా వాళ్లందరి హావభావాలు కూడా బాగున్నాయి. ఈ సన్నివేశం చివర్లో కొసమెరుపు కూడా బాగుంది. ఇది సినిమాలో శివకు అత్యంత నచ్చిన సన్నివేశమట. కానీ నిడివి పెరిగిపోవడంతో తీసేయాల్సి వచ్చిందట. ‘మజిలీ’ ఫైనల్ కాపీ 2 గంటల 40 నిమిషాలు కావడం గమనార్హం. ఈ సీన్లు తీయకముందు ఇంకా ఎక్కువ ఉండి ఉంటుంది. దీంతో తప్పక తనకు అత్యంత సన్నివేశాన్నే తీసేశాడన్నమాట శివ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English