నాని బ్యాటింగ్.. నెమ్మదిగా మొదలైంది

నాని బ్యాటింగ్.. నెమ్మదిగా మొదలైంది

‘జెర్సీ’ సినిమాలో హీరో నాని అగ్రెసివ్ బ్యాట్స్‌మన్. కోచ్ నెమ్మదిగా ఆడు అని చెప్పి పంపించినా కూడా వినడు. చాలా దూకుడుగా ఆడతాడు. తొలి బంతికే సిక్సర్ కొడతాడు. తర్వాత ఎప్పుడు బ్యాటింగ్‌కు దిగినా అదే వరస. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం నాని ఈ దూకుడు చూపించలేకపోయాడు. అతడి బ్యాటింగ్ కొంచెం నెమ్మదిగా ఆరంభమైంది. మంచి బజ్ ఉండి, అదిరిపోయే టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ చిత్రం తొలి రోజు ఓ మోస్తరు స్థాయిలోనే వసూళ్లు రాబట్టింది.

ఏపీ తెలంగాణల్లో ఈ చిత్రానికి రూ.4.5 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. సోలో హీరోగా ఇది నానికి మూడో హైయెస్ట్ ఫస్ట్ డే షేర్. ఎంసీఏ, నిన్నుకోరి సినిమాలకు ఇంతకంటే ఎక్కువగా ఓపెనింగ్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ షేర్ రూ.5.5-6 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఐతే ఓపెనింగ్స్‌ను బట్టి సినిమా అంతిమ ఫలితం మీద ఒక అంచనాకు రావడానికి వీల్లేదు.

నాని గత సినిమాలతో పోల్చకుండా మామూలుగా చూస్తే ‘జెర్సీ’కి మంచి ఓపెనింగ్స్ వచ్చినట్లే లెక్క. ఇది పక్కా క్లాస్ సినిమా. ఆ వర్గం ప్రేక్షకులు ఓ ఎగబడి వెంటనే సినిమాలు చూసేయరు. టాక్ బాగుంటే.. నెమ్మదిగా థియేటర్లకు వస్తారు. క్రికెట్ ఫాలో అయ్యే యూత్‌తో పాటు ఫ్యామిలీస్ ఈ సినిమాను బాగా చూసే అవకాశముంది. పైగా ఇది సమ్మర్ సీజన్. కాబట్టి ‘జెర్సీ’కి లాంగ్ రన్ ఉంటుందని భావిస్తున్నారు.

దీనికి ‘కాంఛన’ సినిమా నుంచి బి, సి సెంటర్లలో గట్టి పోటీ ఉండటం వల్ల కూడా తొలి రోజు వసూళ్లపై ప్రభావం పడింది. ఆ సినిమాకు టాక్ ఎలాగూ బాగా లేదు. కాబట్టి  స్లో అవుతుంది. అప్పుడు ఆ సెంటర్లలో కూడా ‘జెర్సీ’కి వసూళ్లు పెరిగే అవకాశముంది. ఆరంభంలో నాలుగు ధనాధన్ షాట్లు ఆడినంత మాత్రాన లాంగ్ రన్ ఉంటుందని అనుకోవడానికి లేదు. నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించి ఆ తర్వాత దూకుడు పెంచి.. సెంచరీలు కొట్టే బ్యాట్స్‌మెన్ కూడా ఉంటారు. కాబట్గి నాని అలాగే బ్యాటింగ్ చేసి భారీ ఇన్నింగ్స్ ఆడతాడేమో చూద్దాం.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English