నాకా బన్నీతో గొడవా?

నాకా బన్నీతో గొడవా?

మూడేళ్ల కిందట ఇదే సమయానికి అల్లు అర్జున్ చేసిన ఒక కామెంట్ పెను సంచలనానికి కారణమైంది. ‘సరైనోడు’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు.. పవన్ గురించి మాట్లాడమని అరుస్తుంటే.. ‘చెప్పను బ్రదర్’ అని బన్నీ అనడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఆ కామెంట్‌తో పవన్ అభిమానులకు శత్రువుగా మారిపోయాడు. అప్పుడు బన్నీకి, పవన్ అభిమానులకు మధ్య మొదలైన గ్యాప్ ఇప్పటికీ ఫిల్ కాలేదు.

అప్పట్లో బన్నీ మీద పవన్ ఫ్యాన్స్ అసలే కాక మీద ఉంటే.. తన సినిమాకు సంబంధించి ఓ వేడుకలో పవన్ కోసం అభిమానులు అరుస్తుంటే సాయిధరమ్ తేజ్ వారిని ప్రోత్సహించడం.. బన్నీకి కౌంటర్ ఇచ్చేలా మాట్లాడటం మరింత చర్చనీయాంశం అయింది. అప్పట్నుంచి తేజుకి బన్నీ అభిమానులు కొంచెం యాంటీ అయ్యారు.

ఈ నేపథ్యంలో బన్నీకి, తేజుకు గొడవలంటూ ప్రచారం కూడా జరిగింది. ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా తేజు దగ్గర ఇదే విషయం ప్రస్తావిస్తే అతను ఆసక్తికర రీతిలో స్పందించాడు. తనకు, బన్నీకి గొడవలు ఎందుకుంటాయని అతను ప్రశ్నించాడు. తాను, బన్నీ ఒకే కుటుంబానికి చెందిన వాళ్లమని.. చిన్నప్పట్నుంచి కలిసి పెరిగామని.. అలాంటపుడు తామెందుకు గొడవ పడతామని అన్నాడు తేజు.

తాను సాధారణంగా రామ్ చరణ్, వరుణ్ తేజ్‌లతో క్లోజ్‌గా ఉంటానని.. బన్నీని కలవడం తక్కువే అని తేజు చెప్పాడు. కానీ కలిసినపుడల్లా చాలా ఆప్యాయంగా ఉంటామని చెప్పాడు. మెగా ఫ్యామిలీలో అందరం చాలా కలిసి మెలిసి స్నేహంగా ఉంటామని, ఎవ్వరి మధ్య గొడవలు ఉండవని.. అభిమానుల్లో కూడా అంతరాలు ఏమీ ఉండవని అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English