మాస్ వెర్సస్ క్లాస్.. గెలిచేదెవరు?

మాస్ వెర్సస్ క్లాస్.. గెలిచేదెవరు?

‘మజిలీ’.. ‘చిత్రలహరి’ సినిమాల విజయంతో టాలీవుడ్ సమ్మర్ సీజన్‌కు మంచి ఆరంభమే లభించింది. ఈ ఊపులో ఈ వారం బాక్సాఫీస్ మరింత సందడిగా మారుతుందని ఆశిస్తున్నారు. శుక్రవారం ఒకటికి రెండు క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అందులో ఒకటి పక్కా క్లాస్ కాగా.. ఇంకొకటి ఊరమాస్. నాని నటించిన ‘జెర్సీ’ ప్రధానంగా క్లాస్ ప్రేక్షకుల్ని లక్ష్యంగా చేసుకున్న సినిమా. లారెన్స్ నుంచి వస్తున్న ‘కాంఛన-3’ గురించి చెప్పాల్సిన పని లేదు. అది ఊర మాస్ టైపు.

ఈ రెండు సినిమాల మీదా ఆయా వర్గాల ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. నాని తన కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచే చిత్రంగా ‘జెర్సీ’ని చెబుతున్నాడు. దీని టీజర్, ట్రైలర్, ఆడియో.. అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. ఒక స్పెషల్ ఫిలిం చూడబోతున్న నమ్మకాన్ని కలిగించాయి. తెలుగులో అథెంటిక్ స్పోర్ట్స్ డ్రామాలు చాలా చాలా తక్కువ. ఈ జానర్లో ‘జెర్సీ’ ఒక క్లాసిక్ అయ్యే లక్షణాలు ప్రోమోల్లో కనిపించాయి. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగాయి. మంచి టాక్ వస్తే వసూళ్ల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది. నాని కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ కావడానికి అవకాశాలున్నాయి.

ఇక ఈ చిత్రానికి బి-సి సెంటర్లలో థ్రెట్‌గా నిలిచేలా ఉంది ‘కాంఛన-3’. కాంఛన సిరీస్‌లో ఇంతకుముందు వచ్చిన సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. ‘కాంఛన-3’ కూడా మాస్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. దీని ప్రోమోలు ఆ వర్గం ప్రేక్షకులు మెచ్చేలా ఉన్నాయి. లారెన్స్‌కు మామూలుగానే మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ మధ్య మాస్ మసాలా సినిమాలు బాగా తగ్గిపోయిన నేపథ్యంలో ఆ వర్గం ప్రేక్షకులు ఆవురావురుమని ఉన్నారు. మరి లారెన్స్ వాళ్ల ఆకలి తీరుస్తాడేమో చూడాలి. మొత్తానికి ఈ క్లాస్ వెర్సస్ మాస్ పోరులో గెలిచేదెవరో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English