కలర్స్ స్వాతి ఈజ్ బ్యాక్?

కలర్స్ స్వాతి ఈజ్ బ్యాక్?

పెళ్లవ్వగానే హీరోయిన్లు టాటా చెప్పేయడం పాత కథ. ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా చాలామంది కథానాయికలు బ్రహ్మాండంగా కెరీర్ సాగిస్తున్నారు. తెలుగు సమంతే ఇందుకు పెద్ద ఉదాహరణ. పెళ్లి తర్వాత మరింత ఊపుతో సాగిపోతోంది ఆమె కెరీర్. ఐతే కలర్స్ స్వాతి మాత్రం పెళ్లి తర్వాత కనిపించకుండా పోవడంతో ఆమె ఇక సినిమాల్లో కనిపించదనే అనుకున్నారంతా.

కానీ గత ఏడాది ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో స్వాతి చాలా గ్లామరస్‌గా కనిపించడమే కాక, తాను మళ్లీ సినిమాల్లో నటిస్తానని, ఇందుకు తన భర్త నుంచి ప్రోత్సాహం కూడా ఉందని చెప్పింది. కానీ ఆమె అలా అన్నాక మళ్లీ లైమ్ లైట్లో లేకుండా పోవడంతో మళ్లీ ఆమె పునరాగమనంపై అనుమానాలు ముసురుకున్నాయి. ఐతే త్వరలోనే స్వాతి ఒక ఇంట్రెస్టింగ్ మూవీతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

స్వాతి కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిన సినిమాల్లో ‘కార్తికేయ’ ఒకటి. నిఖిల్ సిద్దార్థ హీరోగా కొత్త దర్శకుడు చందూ మొండేటి రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషనల్ హిట్టయింది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారట. అందులో ఒకరు స్వాతినే. ‘కార్తికేయ’లోని పాత్రనే ఇందులోనే కొనసాగిస్తూ ఆ పాత్రకు స్వాతినే ఎంచుకున్నాడట చందూ. మరో కథానాయికగా కొత్త అమ్మాయిని ట్రై చేయబోతున్నారట. హిట్ జోడీ అయిన నిఖిల్-స్వాతిలను మరోసారి చూడబోతుండటం విశేషమే.

‘కార్తికేయ’ తర్వాత ‘ప్రేమమ్’తోనూ హిట్టు కొట్టిన చందూ.. ‘సవ్యసాచి’తో ఎదురు దెబ్బ తిన్నాడు. ఈ సినిమా అతడి కెరీర్‌కు బ్రేకులేసింది. ఐతే తనకు మంచి పేరు తెచ్చిన ‘కార్తికేయ’ సీక్వెల్‌తోనే మళ్లీ తనేంటో రుజువు చేసుకోవాలని చూస్తున్నాడు చందూ. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించే అవకాశాలున్నాయి. తొలి భాగానికి దీటుగా ఈ చిత్రాన్ని థ్రిల్లింగ్‌గా మలచాలని అతను పట్టుదలతో ఉన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English