మాస్‌ మహారాజాకి ఎన్ని కష్టాలో!

మాస్‌ మహారాజాకి ఎన్ని కష్టాలో!

అయితే గడ్డంతో లేదా క్లీన్‌ షేవ్‌తో... రవితేజకి సంబంధించి రెండు వేరియేషన్లు ఇవే. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తుండే రవితేజ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కోసమని మిగతా హీరోల్లా ఏనాడూ కష్టపడలేదు. కనీసం రవితేజ హెయిర్‌ స్టయిల్‌ మార్చడం కూడా ఎప్పుడూ జరగలేదు. అలాంటిది ఇప్పటి ట్రెండులో అలాగే ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే వుంటానంటే కుదరదు. రొటీన్‌ సినిమాలు చేస్తూ కూర్చుంటానంటే థియేటర్లకి జనం కదిలిరారు. అందుకే అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రానికి చిల్లర కూడా రాలకపోయే సరికి మాస్‌ మహారాజా జాగ్రత్త పడుతున్నాడు.

అంతవరకు పారితోషికం తగ్గించనంటే తగ్గించను అన్నవాడు కాస్తా సగానికి పైగానే తగ్గించేసుకున్నాడు. డిస్కోరాజా చిత్రం కోసం మొదటిసారిగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి, గెటప్‌ ఛేంజ్‌కి వెళుతున్నాడు. ఈ చిత్రంలో రవితేజ వివిధ గెటప్స్‌లో కనిపిస్తాడు కనుక వేరియేషన్స్‌ కోసం దర్శకుడు ఆనంద్‌ పలు స్కెచ్‌లు రెడీ చేసి ఇచ్చాడట. అందుకు తగ్గట్టుగా మార్పుచేర్పుల కోసం రవితేజ ఒక పర్సనల్‌ ట్రెయినర్‌ని పెట్టుకుని ఎన్నడూ లేనంతగా కష్టపడుతున్నాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English