సుకుమార్‌కి ఇదేం టార్చర్‌?

సుకుమార్‌కి ఇదేం టార్చర్‌?

రంగస్థలం తీసిన దర్శకుడి తదుపరి చిత్రం తమతోనే అంటే ఏ హీరో అయినా ఆనంద పడాలి. కానీ ఫలానా టైమ్‌కి కథ సిద్ధం చేస్తేనే సినిమా చేస్తానంటూ అతడిపై ఒత్తిడి తీసుకురావడం ఏమిటో అర్థం కాదు. సుకుమార్‌ కథ రెడీ చేయడం లేదని అనిల్‌ రావిపూడితో సినిమా ఓకే చేసేసుకోవడమే కాకుండా సుకుమార్‌తో ఇక చేసేది లేదన్నట్టు స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు మహేష్‌. హీరో డామినేటెడ్‌ ఇండస్ట్రీ కనుక సుకుమారే వెళ్లి మళ్లీ మహేష్‌ని ప్రసన్నం చేసుకున్నాడు. అయితే మహేష్‌ కాకపోయినా ఆ కథ చేయడానికి అల్లు అర్జున్‌ ఒప్పుకున్నాడని సుకుమార్‌ సంతోషపడ్డాడు.

కానీ బన్నీ కూడా అతనిపై ఒత్తిడి తెస్తున్నాడు. సుకుమార్‌ కథ రెడీ చేస్తున్నాడు కదా అని అతడికి సరిపడా సమయం ఇవ్వకుండా 'ఐకాన్‌' అనే మరో సినిమా అనౌన్స్‌ చేసాడు. ఆ దర్శకుడి వద్ద కథ రెడీగా వుండడంతో ఇంకా కథ సిద్ధం కాని సుకుమార్‌ ఒత్తిడికి లోనవుతున్నాడు. బాలీవుడ్‌, హాలీవుడ్‌లో కథ కోసమే ఎన్ని ఏళ్లయినా హీరోలు వేచి చూస్తుంటారు. కానీ ఇక్కడ కథ రెడీ చేయడానికి దర్శకుడికి తగిన సమయం ఇవ్వకుండా తర్వాత అది కానీ మిస్‌ఫైర్‌ అయితే దర్శకుడినే బ్లేమ్‌ చేస్తుంటారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English