పాటల్లో బాహుబలి ఇది!

పాటల్లో బాహుబలి ఇది!

బాక్సాఫీస్‌ వద్ద బాహుబలి ఎలాగైతే సంచలనాలు చేసిందో, యూట్యూబ్‌లో రౌడీ బేబీ పాట అలా పంబ రేపుతోంది. మిగతా పాటలకి వచ్చే వ్యూస్‌కీ, దీనికీ సంబంధమే లేదు. వ్యూస్‌ పరంగా ఇక 'నాన్‌-రౌడీ బేబీ' అని లెక్కలేసుకోవాల్సిన రీతిన సంచలనం చేస్తోంది. ఇప్పటికి నాలుగు వందల మిలియన్‌ వ్యూస్‌కి పైగా సాధించిన రౌడీ బేబీ అతి త్వరలో అయిదు వందల మిలియన్లని దాటడం ఖాయమనిపిస్తోంది. దక్షిణాది సినిమాలకి సంబంధించిన వీడియోల్లో రెండు వందల మిలియన్‌ వ్యూస్‌ వచ్చినవే లేవు.

ఏళ్ల తరబడి యూట్యూబ్‌లో మగ్గిపోతోన్న వాటికి కూడా అంతలేసి వ్యూస్‌ లేవు. కానీ ఈ పాటకి మూడు నెలల్లో ఇన్ని వ్యూస్‌ వచ్చాయి. ఇంతకాలం దక్షిణాది టాప్‌ వీడియోలకి బెంచ్‌ మార్క్‌గా వున్న రౌడీ బేబీ ఇకపై బాలీవుడ్‌ వీడియోలని సవాల్‌ చేయనుంది. దీని బారినుంచి ఎన్ని బాలీవుడ్‌ వీడియోలు తమ రికార్డుని కాపాడుకుంటాయనేది చూడాలి. సాయి పల్లవి డాన్సులు, యువన్‌ సంగీతం వెరసి ఈ పాట ప్రతి పార్టీలోను మస్ట్‌ ప్లే అన్నట్టు తయారైంది. మామూలుగా అయితే ఆడియోతో శాటిస్‌ఫై అయిపోతుంటారు కానీ రౌడీ బేబీకి మాత్రం ఆడియోతో పాటు వీడియో ప్లే చేస్తే కానీ తనివి తీరదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English