పాత హిట్టుని నమ్మి కోట్లు కుమ్మరించారు

పాత హిట్టుని నమ్మి కోట్లు కుమ్మరించారు

లారెన్స్‌ తీసిన సినిమాలు అతికి పరాకాష్ట అనిపిస్తాయి. కాకపోతే ఆ అతి అతని హారర్‌ కామెడీ చిత్రాలని మాస్‌కి దగ్గర చేసింది. ముని సిరీస్‌లో అతను తీసిన చిత్రాలన్నీ కాసులు కురిపించాయి. ఆ సిరీస్‌ రొటీన్‌ అయిపోతుందని అనిపించినా కానీ గత చిత్రం కూడా మంచి హిట్టే అనిపించుకుంది. అందుకే లారెన్స్‌ ఆ సిరీస్‌లో భాగంగా తీసిన తాజా చిత్రం కాంచన 3కి కూడా మంచి రేటు పలికింది. మునుపటి చిత్రం పద్ధెనిమిది కోట్ల షేర్‌ వసూలు చేసిందని, దీనికి పదహారు కోట్లు చెల్లించుకున్నారని తెలిసింది. కానీ కాంచన 2కి విడుదలకి ముందు వున్న బజ్‌ దీనికి లేదు. ట్రెయిలర్‌ కూడా నాసి రకంగా అనిపించింది.

ట్రెయిలర్‌లో హారర్‌, కామెడీ కంటే లారెన్స్‌ మాస్‌ హీరోయిజం ప్రయాస ఎక్కువగా కనిపించింది. అయినా కానీ లారెన్స్‌ సినిమాకి మాస్‌ ప్రేక్షకులు బారులు తీరతారనే నమ్మకంతో దీనిపై భారీగా పెట్టుబడి పెట్టారు. తెలుగు సినిమా జెర్సీతో పోటీ వున్నా కానీ కాంచన 3 ఆడియన్స్‌ దానికే ఎక్స్‌క్లూజివ్‌గా వుంటారని విశ్వసిస్తున్నారు. మరి లారెన్స్‌ మీద పెట్టుకున్న నమ్మకం వర్కవుట్‌ అవుతుందా లేక కాంచన సిరీస్‌కి ఇంతటితో ఫుల్‌స్టాప్‌ పడుతుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English