నానిది కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా?

నానిది కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా?

నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘జెర్సీ’ విడుదలకు రంగం సిద్ధమైంది. శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా గురించి నాని ముందు నుంచి ఓ రేంజిలో చెబుతున్నాడు. నాని గతంలో ఏ సినిమాకు కూడా ఇంత ఉద్వేగానికి గురైంది లేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాదని.. అంతకుమించి అని.. గొప్ప సినిమా అని అంటున్నాడు. తనను అభిమానించేవాళ్లందరూ గర్వించే సినిమా ఇది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. మొన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్లో, తాజాగా మీడియా ఇంటర్వ్యూల్లో ఇలాగే మాట్లాడాడు. అతడి మాటలతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇది సినిమాకు మేలు చేస్తుందా చేటు చేస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘జెర్సీ’కి ముందు నుంచి మంచి బజ్ ఉంది.

నాని గత రెండు సినిమాలు ఫ్లాప్ అయినా సరే.. దీనికి ఇలాంటి బజ్ రావడం విశేషమే. టీజర్, ట్రైలర్, ఆడియో అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. వాటి ద్వారా వచ్చిన బజ్ చాలు సినిమాకు. కానీ నాని తన మాటలతో, అగ్రెసివ్ ప్రమోషన్లతో ఇంకా హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మాటలు విన్నాక ప్రేక్షకులకు సినిమాపై మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకుని ఉంటారనడంలో సందేహం లేదు. ఆ అంచనాల్ని అందుకోవడం సులువు కాదు. కొన్ని సినిమాలు ప్రోమోలతో విపరీతంగా ఆకట్టుకుని తీరా సినిమా చూశాక అంత లేదని నిరాశ చెందిన సందర్భాలు ఉన్నాయి. సినిమాపై ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ మరీ ఎక్కువ చెప్పుకోకూడదు. నాని తీరు చూస్తుంటే అతడిది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరి రేప్పొద్దున సినిమా చూసి ప్రేక్షకులు ఏమంటారో చూడాలి. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి రూపొందించిన ఈ ిచిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. నాని సరసన కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ నటించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English