‘బ్రహ్మోత్సవం’లో ఆ పాయింటే ఎగ్జైట్ చేసిందా?

‘బ్రహ్మోత్సవం’లో ఆ పాయింటే ఎగ్జైట్ చేసిందా?

టాలీవుడ్ ఆల్ టైం డిజాస్టర్లలో ఒకటైన ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయబోతున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ‘బ్రహ్మోత్సవం’ ఎంత పెద్ద డిజాస్టర్ అన్నది తమిళ జనాలకు కూడా బాగానే తెలుసు. ఈ సోషల్ మీడియా కాలంలో వేరే భాషల చిత్రాల్ని కూడా జనాలు అనుసరిస్తున్నారు. ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు వచ్చిన డిజాస్టర్ టాక్.. దాని గురించి జరిగిన ట్రోలింగ్.. దానికి వచ్చిన నష్టాల గురించి పెద్ద చర్చ నడవడంతో తమిళ జనాలకూ దీని గురించి బాగానే తెలిసింది.

అలాంటి  సినిమాను ప్రముఖ దర్శకుడు చేరన్ రీమేక్ చేయాలనుకోవడం పట్ల అందరూ షాకైపోయారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే.. ‘బ్రహ్మోత్సవం’ ఆల్రెడీ తమిళంలోకి డబ్ అయింది కూడా. మహేష్‌కు ‘స్పైడర్’తో తమిళంలోనూ గుర్తింపు రావడం.. ఇందులో సత్యరాజ్, కాజల్, సమంత లాంటి తారాగణం ఉండటంతో డబ్ చేసి రిలీజ్ చేశారు. అక్కడ ఆ చిత్రం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.

అలాంటి సినిమాను చేరన్ రీమేక్ చేయాలనుకోవడం విడ్డూరం. ఐతే ‘బ్రహ్మోత్సవం’ ఎలాంటి ఫలితాన్నందుకున్నది పక్కన పెడితే.. అందులోని ఒక పాయింట్ చేరన్‌కు బాగా నచ్చేసినట్లు సమాచారం. ఏడుతరాలకు చెందిన బంధువుల్ని వెతుక్కులూ ఊర్లు తిరిగే హీరో చివర్లో అందరినీ ఒక చోటికి చేర్చడం అనే పాయింట్‌తో చేరన్ బాగా కనెక్టయిపోయాడట. ఈ పాయింట్ తీసుకుని.. దీని చుట్టూ వేరేగా కథ అల్లుతున్నాడట.

తెలుగులో మాదిరి పూర్తిగా ఔట్ ఆఫ్ ద బాక్స్ వెళ్లిపోకుండా ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్టయ్యేలా.. ఇంటెన్సిటీతో సినిమా తీయాలన్నది చేరన్ ప్లాన్. దర్శకుడిగా చేరన్‌గా చాలా మంచి పేరుంది. భావోద్వేగాలు పండించడంలో అతను దిట్ట. ‘ఆటోగ్రాఫ్’ సహా కొన్ని అద్భుతమైన సినిమాలు అందించాడతను. ‘బ్రహ్మోత్సవం’లోని పై పాయింటే బేస్ చేసుకుని సరిగా సినిమా తీస్తే రీమేక్ ప్రేక్షకుల్ని మెప్పించినా మెప్పిించవచ్చేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English