కొడుకుతో నాని.. అడోరబుల్ పిక్

కొడుకుతో నాని.. అడోరబుల్ పిక్

నేచురల్ స్టార్ నాని ఇప్పుడు చాలా ఉద్వేగంతో ఉన్నాడు. అతడి కెరీర్లో చాలా స్పెషల్ మూవీ అనదగ్గ ‘జెర్సీ’ ఇంకొక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విషయంలో నాని ఎంత కాన్ఫిడెంట్‌గా, ఎమోషనల్‌గా ఉన్నాడో మొదట్నుంచి చూస్తూనే ఉన్నాం. మొన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా నాని ఓ రేంజిలో చెప్పాడు ఆ సినిమా గురించి.. మీడియా ఇంటర్వ్యూల్లో సైతం ‘జెర్సీ’ తాను గర్వంగా చెప్పుకునే సినిమా అంటున్నాడు. రెండు నెలలకు పైగా క్రికెట్ శిక్షణ తీసుకుని అతనీ సినిమా చేశాడు. దీని కోసం ఎంతో కష్టపడ్డాడు. ప్రధానంగా ఓ క్రికెటర్ జీవితాన్ని చూపిస్తూ తీసిన ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల బంధం కూడా ఓ కీలకమైన అంశం. రెండేళ్ల క్రితమే కొడుకును కన్న నానికి అతడితో చాలా ఎటాచ్మెంట్ ఉంది. తన కొడుకును జున్ను అని పిలుచుకునే నాని.. తన గురించి మీడియా ఇంటర్వ్యూల్లో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతుంటాడు. ఈ నేపథ్యంలోనే ‘జెర్సీ’ సినిమా విషయంలో మరింత ఎమోషనల్‌గా ఉన్నాడు నాని.

ఇదిలా ఉండగా రేపు జెర్సీ విడుదల నేపథ్యంలో ఈ రోజు ఒక అడోరబుల్ పిక్ ట్విట్టర్లో షేర్ చేశాడు నాని. తన కొడుకు అర్జున్ అలియాస్ జున్నుతో నాని కలిసి ఉన్న ఫొటో అది. అందులో ‘జెర్సీ’లో తాను ధరించిన అర్జున్ జెర్సీతోనే ఉన్నాడు నాని. అర్జున్ జెర్సీ మీదేమో.. ‘మా నాన్న నా పేరును తీసుకున్నాడు’ అని రాసి ఉంది. ‘జెర్సీ’ సినిమాలో నాని పేరు అర్జున్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాని కొడుక్కి మాత్రం నాని అని పేరు పెట్టారు. సినిమాలోని చమక్ ఇదే. నాని షేర్ చేసిన ఫొటో భలేగా అనిపిస్తోంది నెటిజన్లకు. నిజానికి నానిని దృష్టిలో ఉంచుకుని సినిమాలో ఆ పాత్రలకు ఆ పేర్లు పెట్టలేదట దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఈ సినిమా నానితో అనుకోవడానికి ముందే అర్జున్, నాని అనే పేర్లనే పాత్రలకు పెట్టాడట. ఇదే విషయం నానికి చెబితే ఆశ్చర్యపోయాడట. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాని వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English