కరణ్ జోహార్‌కు షాక్.. సినిమా డిజాస్టర్

కరణ్ జోహార్‌కు షాక్.. సినిమా డిజాస్టర్

బాలీవుడ్లో కరణ్ జోహార్ ఏది పట్టుకున్నా బంగారమే. హిట్లు కొట్టి కొట్టి అలసిపోయాడతను. దక్షిణాది నుంచి వచ్చిన ‘బాహుబలి’, ‘2.0’ సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే అవి కూడా బ్లాక్ బస్టర్లయి కూర్చున్నాయి. ఇక సొంతంగా నిర్మించే చిత్రాల సంగతి చెప్పాల్సిన పని లేదు. గత ఏడాది చివర్లో అతడి సంస్థ నుంచి వచ్చిన ‘సింబా’ కూడా బ్లాక్ బస్టర్ అయింది. కరణ్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ వినోదం ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారు. అతను ఏ సినిమా తీసినా హిట్టే అన్న నమ్మకంతో ఉంటాడు ఇండస్ట్రీ జనాలు. కరణ్ ప్రొడక్షన్లో తెరకెక్కిన కొత్త సినిమా ‘కళంక్’ కూడా ఈ కోవలోకే చేరుతుందని అంతా అనుకున్నారు. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్లలో భారీతనం చూసి ఏదో ఊహించుకున్నారు ప్రేక్షకులు. ఇది బాలీవుడ్ బాహుబలి అని కూడా అన్నారు.

కానీ ఈ రోజు రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఉదయం షో నుంచే సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చింది. సాయంత్రానికి వచ్చేసరికి ఆ టాక్ బాగా విస్తృతమైంది. కేవలం విమర్శలు చేయడం కాదు.. ఈ సినిమా మీద కామెడీలు చేస్తూ జోకులు పేలుస్తూ చెలరేగిపోతున్నారు నెటిజన్లు. సరైన కథాకథనాలు లేకుండా బోరింగ్‌గా సినిమాను నడిపించడంతో ప్రేక్షకులు థియేటర్లలో హాహాకారాలు చేస్తున్నారట. మధ్యలోనే చాలామంది థియేటర్ల నుంచి వెళ్లిపోతున్నారట. ఈ మధ్య కాలంలో హిందీలో ఇంత బోరింగ్ సినిమా మరొకటి లేదని అంటున్నారు. వరుణ్ ధావన్, ఆలియా భట్, సిద్దార్థ్ రాయ్ కపూర్, సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహించాడు. ఆర్టిస్టుల పెర్ఫామెన్స్, అందమైన విజువల్స్, ఆర్ట్ వర్క్ తప్ప సినిమాలో ఏమీ లేదన్నది ప్రేక్షకుల మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English