సూపర్‌స్టార్ల కంటే ముందుగా నాని!

సూపర్‌స్టార్ల కంటే ముందుగా నాని!

తెలుగు హీరోలు పొరుగు రాష్ట్రాల్లోనే ఇంకా గ్యారెంటీ రిటర్న్స్‌ రాబట్టలేకపోతున్నారు. కర్నాటక మినహాయించి మన సినిమాలకి గ్యారెంటీ ఇన్‌కమ్‌ లేదు. అలాంటిది మన సినిమా ఒకటి చైనాలో విడుదలకి సిద్ధమవుతోంది. చైనీయులు ఈమధ్య భారతీయ చిత్రాలని ఎగబడి చూస్తున్నారు. అయితే అన్ని సినిమాలని చూసేందుకు వాళ్లు ఇష్టపడడం లేదు. ఏ చిత్రాల్లో అయితే ఎమోషనల్‌ కంటెంట్‌ వుంటుందో దానికి బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే దంగల్‌ చిత్రానికి భారతదేశంలో వచ్చిన దానికంటే ఎక్కువ చైనాలోనే వసూలయింది.

ఇండియన్‌ ఎమోషన్స్‌కి చైనీయులు కనక్ట్‌ అవుతున్నారు కనుక 'జెర్సీ'ని కూడా అక్కడ విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రంలో ఎమోషనల్‌ డ్రామా ఎక్కువ వుంటుంది కనుక, స్పోర్ట్స్‌ సినిమా కనుక యూనివర్సల్‌ అప్పీల్‌ వుంటుంది కనుక ఇది అక్కడ బాగా ఆడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే చైనీయులకి క్రికెట్‌ అంతగా నచ్చదు. క్రికెట్‌ ఆడే దేశాల్లో చైనా ఎక్కడా కనిపించదు. ఇది క్రికెట్‌ నేపథ్యమున్న సినిమా కనుక వారు దీనిని ఆదరిస్తారా లేదా అనేది ఆసక్తికరం. ఏది ఏమైనా మిగతా స్టార్‌ హీరోలు దృష్టి సారించని మార్కెట్‌పై నాని కన్నేసాడంటే గొప్ప విషయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English