శ్రీరెడ్డి కంటే ఘోరంగా ఏమిటిది?

శ్రీరెడ్డి కంటే ఘోరంగా ఏమిటిది?

ఎదుటి వారిపై బురద జల్లే విషయంలో శ్రీరెడ్డి తర్వాతే ఎవరైనా అనేంతగా రెచ్చి పోయి బురద జల్లుడు కార్యక్రమంలో పతకాలు సాధించేసింది. అయితే నటిగా ఎలాంటి గుర్తింపు తెచ్చుకోలేకపోయిన శ్రీరెడ్డి పబ్లిసిటీ కోసమని అలా వివాదాలని ఎంచుకోవడంలో వింత లేదు. కానీ ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాలు పలుమార్లు అందుకున్న కంగన రనౌత్‌ ఏమిటి శ్రీరెడ్డిలా ప్రవర్తిస్తోంది. సాటి మహిళగా తనకి 'మణికర్ణిక' వివాదంలో అసలు మద్దతు తెలుపలేదంటూ అకారణంగా ఆలియాభట్‌ని గొడవల్లోకి లాగిన కంగన రనౌత్‌ అక్కడితో ఆగలేదు. అవసరం వున్నా లేకపోయినా ఆలియా పేరు తీసుకొచ్చి ఆమెని తీవ్రంగా దూషిస్తోంది. ఇటీవల ఒక పోల్‌లో ఉత్తమ నటి ఎవరంటూ తనని, ఆలియా భట్‌ని లిస్ట్‌లో పెడితే తనతో పోటీ పడేంత సీన్‌ ఆమెకి వుందా? అంటూ ఎద్దేవా చేసింది.

కంగన మంచి నటి కావచ్చు కానీ ఇలాంటి విషయాలలో గ్రేస్‌ఫుల్‌గా వ్యవహరించకపోతే అభిమానులు సైతం ఎందుకు లైక్‌ చేస్తారు? ఆలియా భట్‌ కూడా నటిగా ఎంతో ప్రతిభగలదని నిరూపించుకుంది. కంగనలా ఆమె ఛాలెంజింగ్‌ పాత్రలు చేసి వుండకపోవచ్చు కానీ ఆలియా నటనకి వంక పెట్టడం బుద్ధిలేనితనం. అప్పట్లో ఒకసారి ఆలియా తండ్రి మహేష్‌ భట్‌ తన చెల్లిని అవమానించాడని కంగన సోదరి రంగోలి చెప్పింది. ఆమెపై చెప్పు విసరడంతో పంతొమ్మిదేళ్ల వయసున్న కంగన మనసు గాయపడిందని ఏకరవు పెట్టింది. అందుకని ఇప్పుడతని కూతురి మీద పగ తీర్చుకుంటోందా? నటిగా ఎంత సాధించినా కానీ ఇంత స్టుపిడ్‌గా వ్యవహరిస్తే రేపు కంగన సినిమాలు చూసేదెవరు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English