పవన్‌కళ్యాణ్‌ ఇన్‌ హిడెన్‌ మోడ్‌

పవన్‌కళ్యాణ్‌ ఇన్‌ హిడెన్‌ మోడ్‌

తుఫాను పర్యటన చేసేసి సడన్‌గా హైబర్‌నేషన్‌లోకి పోవడం పవన్‌కళ్యాణ్‌కి అలవాటుగా మారిపోయింది. ఎన్నికల ప్రచారానికి ముందు చేసిన పోరాట యాత్ర నుంచి కూడా పవన్‌ అడపాదడపా కొన్నాళ్లు మిస్‌ అయిపోయాడు. అప్పుడే అతనికి చిత్తశుద్ధి లేదని, బద్ధకమని కొందరు అభిమానులు కూడా సైడ్‌ అయిపోయారు. అయితే ఒక్కసారి అభ్యర్థులని ప్రకటించిన తర్వాత పవన్‌ ప్రచార పరంగా అస్సలు జోరు తగ్గించలేదు. వడదెబ్బ తగిలినా కానీ చికిత్స తీసుకుంటూనే చివరి రోజు వరకు కష్టపడ్డాడు. అయితే ఒక్కసారి ఎన్నికలు ముగిసిన తర్వాత పవన్‌ మళ్లీ హిడెన్‌ మోడ్‌లోకి వెళ్లిపోయాడు.

చంద్రబాబు, జగన్‌ తరచుగా మీడియా ముందు కనబడుతున్నా పవన్‌ మాత్రం ఫలితాలొచ్చాక చూసుకుందామన్నట్టు సైలెంట్‌ అయిపోయాడు. మరోవైపు తన పార్టీ తరఫున పోటీ చేసిన వారు జయాపజయాలతో పని లేకుండా ఇప్పటికే ప్రజల్లో మమేకమై తిరుగుతున్నారు. ఎన్నికల హామీలని గెలుపు ఓటములతో పని లేకుండా తీరుస్తూ తమ ఇమేజ్‌ పెంచుకుంటున్నారు. పవన్‌ మాత్రం సినిమాల విషయంలో ఎలాగయితే ఒకసారి పూర్తి చేసేసిన తర్వాత గమ్మున వుండిపోయేవాడో అదే ధోరణి రాజకీయాల్లోను ప్రదర్శిస్తున్నాడు. నిజానికి పవన్‌ యాక్టివ్‌గా వుండడానికి, జనంపై తాను సీరియస్‌ పొలిటీషియన్‌ అని ముద్ర వేయించుకోవడానికి ఇదే మంచి తరుణం. రేపు రిజల్ట్స్‌ వచ్చాక పవన్‌కి ఆశించిన సీట్లు రాకపోతే అప్పుడు అతను ఎంత ప్రయత్నించినా మీడియాతో పాటు పబ్లిక్‌ కూడా లెక్క చేయకపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English