సీతని రౌండప్‌ చేసేసారుగా!

సీతని రౌండప్‌ చేసేసారుగా!

తేజ దర్శకత్వంలో కాజల్‌ టైటిల్‌ రోల్‌లో, బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా రూపొందుతోన్న సీత రిలీజ్‌ వాయిదా పడనుందని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే వెంటనే వాటిని ఖండిస్తూ రిలీజ్‌కి రెడీగా వుందని, ఏప్రిల్‌ 25నే వస్తుందని ఒక పాటతో పాటు టీజర్‌ కూడా రిలీజ్‌ చేసేసారు. హడావిడిగా బిజినెస్‌ కూడా క్లోజ్‌ చేసేసారు. అయితే సీత ఊహించని ఇబ్బందులు హాలీవుడ్‌నుంచి ఎదురయ్యాయి. అవెంజర్స్‌ 4 అదే వారంలో విడుదలవుతూ వుండడంతో ఓవర్సీస్‌లో సీతకి థియేటర్లు దొరికే పరిస్థితి లేదు.

అలాగే ముందు వారంలో వస్తోన్న జెర్సీ వల్ల హైదరాబాద్‌లో కూడా మల్టీప్లెక్స్‌ షోస్‌ పరంగా రాజీ తప్పదు. అందుకే మే 2 లేదా 16న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారని తాజా సమాచారం. అయితే మహేష్‌ 'మహర్షి' మే 9న వస్తోంది కనుక ఈ రెండు డేట్స్‌పై కూడా క్లారిటీ లేదు. ఎటు చూసినా పెద్ద సినిమాలు రౌండప్‌ చేసేసి వుండడంతో సీతకి ప్రస్తుతం రిలీజ్‌ డేట్‌ ఫైనలైజ్‌ కావడం లేదు.

వారానికో పెద్ద సినిమా వున్న టైమ్‌లో విడుదల చేయడం కంటే కాస్త తాపీగా విడుదల చేసుకుంటే ఈ చిన్న సినిమాకి లాభమని బయ్యర్లు కూడా సూచిస్తున్నారని, అంచేత సీత రిలీజ్‌ డేట్‌ ఏమిటనేది పక్కాగా ఒక రెండు రోజుల్లో అనౌన్స్‌ చేస్తారని తెలిసింది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English