పవన్‌కళ్యాణ్‌ మాట సాయం చేస్తాడా?

పవన్‌కళ్యాణ్‌ మాట సాయం చేస్తాడా?

ఆరు పరాజయాలతో తన కెరియర్‌ ప్రశ్నార్ధకమైన దశలో చిత్రలహరితో సాయి తేజ్‌కి కాస్త ఊరట లభించింది. ఈ చిత్రం డీసెంట్‌గా పర్‌ఫార్మ్‌ చేస్తూ వుండడంతో సాయి తేజ్‌ ఆనందం పట్టలేకపోతున్నాడు. ఈ చిత్రం వసూళ్లని ఇంకాస్త పెంచేందుకు చిరంజీవితో ఒక వీడియో బైట్‌ కూడా వదిలారు. సినిమా చాలా బాగుందంటూ ప్రశంసించిన చిరంజీవి మాటలతో మరి కొంతమంది చిత్రలహరి చూసి వుంటారు.

అలాగే రాజకీయాలతో అలసిపోయిన పవన్‌కళ్యాణ్‌ కూడా ఈ చిత్రం చూసి కాస్త ఎంటర్‌టైన్‌ అయ్యాడు. ప్రచారం ముగించుకున్న తర్వాత హైదరాబాద్‌కి వచ్చిన పవన్‌కి చిత్రలహరి స్పెషల్‌ షో వేసారు. సాయి తేజ్‌ ఎంచుకున్న క్యారెక్టర్‌, కథాంశం బాగున్నాయని పవన్‌ కళ్యాణ్‌ ప్రశంసించాడట. చిత్రలహరి బృందాన్ని కూడా అభినందించాడట. అయితే పవన్‌ ప్రశంసలు ఆఫ్‌లైన్‌కే పరిమితమయ్యాయి.

వీడియో బైట్స్‌ విడుదల చేయడం ఇష్టం లేని పవన్‌ కళ్యాణ్‌ చిత్రలహరికి కూడా అలాంటిదేమీ చేయలేదు. మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయాడని రాస్తారనో ఏమో పవన్‌ ఈ చిత్రం చూసిన విషయాన్ని కూడా గోప్యంగానే వుంచారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English