బన్నీకి కూడా బొంబాయ్‌ అమ్మాయ్‌ కావాలి!

బన్నీకి కూడా బొంబాయ్‌ అమ్మాయ్‌ కావాలి!

నిన్న మొన్నటి వరకు బాలీవుడ్‌ హీరోయిన్లెందుకు... బాగా ఎక్స్‌పెన్సివ్‌ అనుకున్న తెలుగు నిర్మాతలే ఇప్పుడు టాప్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌ని తీసుకుంటే సినిమాకి బాగా క్రేజ్‌ వస్తుందని భావిస్తున్నారు.

తోటి హీరోలు బాలీవుడ్‌ భామలతో రొమాన్స్‌ చేస్తున్నపుడు మిగతా వారికి కూడా తమ సినిమాలోను అలా వుండాలని మిగతా హీరోలు ఆశిస్తారు. సాహోలో శ్రద్ధా కపూర్‌తో ప్రభాస్‌ రొమాన్స్‌ చేస్తోంటే, రామ్‌ చరణ్‌కి ఏకంగా ఆలియా భట్‌ని తీసుకొచ్చారు. సో... అల్లు అర్జున్‌ ఐకాన్‌లో కూడా ఒక బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ కోసం చూస్తున్నారు.

దిల్‌ రాజు నిర్మాణంలో శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఐకాన్‌ (కనబడుట లేదు) అనే చిత్రాన్ని అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంట్లో బాలీవుడ్‌ తార వుంటే బాగుంటుందని బన్నీ సూచించాడట. దీంతో తమ బడ్జెట్‌లో ఫిట్‌ అయ్యే బాలీవుడ్‌ బ్యూటీ కోసం దిల్‌ రాజు అన్వేషణ సాగిస్తున్నాడట.

సాహో, ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్రాలంటే రెండు వందల యాభై కోట్లకి పైగా బడ్జెట్‌ పెడుతోన్న భారీ సినిమాలు కనుక వాటికి బాలీవుడ్‌ మార్కెట్‌ కోసమని శ్రద్ధ, ఆలియాని తీసుకున్నారు. కానీ రీజనల్‌ సినిమాలో బాలీవుడ్‌ తార అంటే వారు అడిగే పైకానికి నిర్మాతకి వర్కవుట్‌ అవుతుందా అనేది అనుమానమే మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English