హీరో వేస్ట్ ఫెలో.. సినిమా సూపర్ హిట్

హీరో వేస్ట్ ఫెలో.. సినిమా సూపర్ హిట్

హీరో ఎందుకు పనికి రానివాడిగా ఉంటాడు. అందరూ అతడిని తిట్టిపోస్తుంటారు. అతడికి ఏదీ కలిసి రాదు. తెరపై పాత్రలకే కాదు.. సినిమా చూస్తున్న వాళ్లకు కూడా ఆ పాత్ర అసహనం కలిగిస్తుంది. హీరో ఇలాంటోడేంటి.. అలా ప్రవర్తిస్తున్నాడేంటి అనిపిస్తుంది. ఐతే అలాంటి పాత్రలో తర్వాత పరివర్తన వస్తుంది. చివరగా ఆ పాత్రకు అందరికీ నచ్చేలా ప్రవర్తిస్తుంది. తెరపై పాత్రలకే కాదు ప్రేక్షకులకు కూడా వినోదం పంచుతుంది. ఇప్పుడు ఇలాంటి పాత్రలే వెండి తెరపై వెలిగిపోతున్నాయి. వరుసగా ఇలాంటి హీరో పాత్రలతోనే దర్శకులు సక్సెస్‌‌లు సాధిస్తుండటం విశేషం. ఒకప్పుడు ‘7/జి బృందావన కాలనీ’.. ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’.. ‘రఘువరన్ బీటెక్’ లాంటి సినిమాల్లో హీరోల పాత్రలు ఇలాగే ఉండి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఆ సినిమాలన్నీ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఇదే ట్రెండును ఫాలో అవుతూ హిట్లు కొడుతున్నారు. గత ఏడాది శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘నీదీ నాదీ ఒకే కథ’లో కూడా హీరో ఎందుకూ పనికి రాని వాడి లాగే కనిపిస్తాడు. హీరో తండ్రి అతడినెప్పుడూ తిడుతూనే ఉంటాడు. బయటి జనాలు కూడా అతడిని ఒక వేస్ట్ ఫెలోగానే చూస్తారు. కానీ చివరికి ఆ పాత్రే ఉన్నతంగా కనిపిస్తుంది. ఇక లేటెస్టుగా ‘మజిలీ’ సినిమాలో హీరో సంగతి తెలిసిందే. ప్రేమలో విఫలమయ్యాక మద్యానికి బానిసై భార్య దగ్గర డబ్బులు తీసుకుని దాన్ని కూడా మందు కోసం తగలేస్తుంటాడు. అతడిని చూస్తే మనకే ఫ్రస్టేషన్ వచ్చేస్తుంది. కానీ ఆ పాత్రలో తర్వాత పరివర్తన వచ్చి భార్యతో పాటు అందరి మనసులూ గెలుస్తుంది. గత వారం వచ్చిన ‘చిత్రలహరి’లో హీరో పాత్ర కూడా ఇలాగే ఉంటంది. అదో పెద్ద ఫెయిల్యూర్ క్యారెక్టర్. కానీ చివరికి ఆ పాత్రే గొప్ప విజయం సాధించి అందరికీ రోల్ మోడల్‌గా నిలుస్తుంది. ఇక ఈ వారం రాబోతున్న ‘జెర్సీ’నూ హీరో ఫెయిల్యూర్‌ క్యారెక్టరే చేస్తున్నాడు. అది కూడా సక్సెస్ అయ్యేలాగే కనిపిస్తోంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English