‘జెర్సీ’ ఈవెంట్లో డైరెక్టర్ ఎందుకు లేడు?

‘జెర్సీ’ ఈవెంట్లో డైరెక్టర్ ఎందుకు లేడు?

ఆడియో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ అంటే అందులో కచ్చితంగా దర్శకుడు, సంగీత దర్శకుడు ఉండాల్సిందే. ఆ రోజుకు వాళ్లిద్దరే ఎంతో కీలకం. ఏ సినిమా ఈవెంట్లో అయినా సరే.. వీళ్లిద్దరూ అస్సలు మిస్సవ్వరు. ఐతే సోమవారం రాత్రి జరిగిన ‘జెర్సీ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాత్రం ఆ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ లేరు.

వేర్వేరు కారణాలతో వీళ్లిద్దరూ ఈ ఈవెంట్‌కు రాలేకపోయారు. దీంతో చిత్ర బృందంతో వీరికేమైనా అభిప్రాయ భేదాలు తలెత్తాయా అన్న సందేహాలు కలిగాయి జనాలకు. కానీ అసలు విషయం అది కాదంటూ నాని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అనిరుధ్ వేరే పని ఉండి ఈ ఈవెంట్‌కు రాలేకపోయాడట. ఇక గౌతమ్ విషయానికొస్తే.. ‘జెర్సీ’ పనుల్లో బిజీగా ఉండటం వల్లే ఈవెంట్‌కు హాజరు కాలేకపోయాడట.

హైదరాబాద్‌లో ఈవెంట్ జరుగుతుంటే.. గౌతమ్ మాత్రం చెన్నైలో ఉన్నాడట. అక్కడ మిక్సింగ్ పనులు పూర్తి చేసి.. ఫైనల్ కాపీ తీసి అమెరికాకు డిస్క్‌లు డెలివర్ చేసే పనిలో తీరిక లేకుండా ఉన్నాడట గౌతమ్. ఐతే నిన్న మధ్యాహ్నానికి దాదాపుగా పని ఒక కొలిక్కి వచ్చిందని.. తాను ఫోన్ చేసి ఈవెంట్‌కు వచ్చేయ్ మరి అని చెబితే.. తన పని దాదాపుగా పూర్తయిందని.. కానీ రాత్రి 9 గంటల వరకు తాను కనుక అక్కడ ఉండగలిగితే.. ఔట్ పుట్ ఇంకొంచెం బెటర్‌గా వచ్చే అవకాశం ఉందని.. కాబట్టి ఈవెంట్‌కు రాలేనని తనకు చెప్పాడని నాని తెలిపాడు.

ఇది గౌతమ్ కమిట్మెంట్‌కు నిదర్శనమని.. అలాంటి దర్శకుడితో పని చేయడం తన అదృష్టమని నాని అన్నాడు. గౌతమ్ టాలీవుడ్ గర్వించదగ్గ దర్శకుడు అవుతాడని.. రేప్పొద్దున అతడి కొడుకు పెరిగి పెద్దవాడై తన తండ్రిని చూసి గర్విస్తాడని నాని అన్నాడు. ‘జెర్సీ’ బ్లాక్ బస్టర్ అవుతుంది అనే మాటలు తాను చెప్పనని.. ఇది అంతకుమించి గొప్ప సినిమా అని నాని అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English