చైనాలో భారతీయ సినిమా సంచలనం

చైనాలో భారతీయ సినిమా సంచలనం

అంధాదున్.. గత ఏడాది సంచలన విజయం సాధించిన హిందీ సినిమా. ఆయుష్మాన్ ఖురాన్ లాంటి చిన్న హీరోను పెట్టి శ్రీరామ్ రాఘవన్ తీసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ అద్భుత విజయం సాధించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో గత ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. దీని కాస్టింగ్ ప్రకారం చూస్తే ఆ వసూళ్లు చాలా ఎక్కువే. వసూళ్ల సంగతలా ఉంచితే కంటెంట్ పరంగా ఈ చిత్రం గొప్ప ప్రశంసలందుకుంది.

ఇప్పుడీ చిత్రం చైనాలో సైతం సంచలనం రేపుతోంది. గత కొన్నేళ్లుగా హిందీ సినిమాలు చైనాలో మంచి వసూళ్లు రాబడుతున్న సంగతి తెలిసిందే. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు అక్కడ అనూహ్య విజయం సాధిస్తున్నాయి. సీక్రెట్ సూపర్ స్టార్, హిందీ మీడియం లాంటి చిత్రాలు ఈ కోవలోనివే. ఇప్పుడు ‘అందాదున్’ ఆ జాబితాలో చేరింది.

ఇటీవలే చైనాలో విడులైన ఈ చిత్రం సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. ఆల్రెడీ రూ.200 కోట్ల మార్కును దాటేసిందీ చిత్రం. డాలర్లలో దీని వసూళ్లు 30 మిలియన్ల మార్కును అందుకున్నాయి. ఇంకా ఈ చిత్రం జోరు కొనసాగుతోంది. ఇది ఈజీగా రూ.300 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేస్తుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది చైనాలో చైనీస్, ఇంగ్లిష్ కాకుండా వేరే భాషల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే కావడం విశేషం.

మామూలుగా జపనీస్ సినిమాలు అక్కడ భారీగా వసూళ్లు రాబడుతుంటాయి. వాటిని అధిగమించి ‘అందాదున్’ దూసుకెళ్తోంది. చైనాలో హైయెస్ట్ గ్రాస్డ్ ఇండియన్ సినిమాల్లో ఇది ఇప్పటికే ఐదో స్థానానికి చేరుకుంది. ‘దంగల్’ చైనాలో దాదాపు రూ.1300 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో అగ్రస్థానంలో ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English