బన్నీ-త్రివిక్రమ్ సినిమా టైటిల్ అదేనా?

బన్నీ-త్రివిక్రమ్ సినిమా టైటిల్ అదేనా?

ఎట్టకేలకు అల్లు అర్జున్ మళ్లీ మేకప్ వేసుకుంటున్నాడు. ‘నా పేరు సూర్య’ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న అతను.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను ఇటీవలే ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ గురించి కొన్ని నెలల ముందు నుంచే రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇంతకుముందు ఈ కాంబినేషన్లో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తరహాలోనే ఇది కూడా తండ్రీ కొడుకుల సెంటిమెంటు నేపథ్యంలో నడిచే కథ అని ప్రచారం జరిగింది. దీనికి ‘నాన్న నేను’ అనే టైటిల్ కూడా వినిపించింది. ఐతే ఇప్పుడు ఈ చిత్రానికి కొత్త టైటిల్ తెరపైకి వచ్చింది. అలకానంద.. ఇదీ బన్నీ-త్రివిక్రమ్ చిత్రానికి వినిపిస్తున్న కొత్త పేరు.

తన గత సినిమాకు ‘అరవింద సమేత’ అనే పేరు పెట్టి హిట్టు కొట్టిన త్రివిక్రమ్.. ‘అ’ సెంటిమెంటును కొనసాగిస్తూ తన కొత్త చిత్రానికి కూడా అదే అక్షరంతో టైటిల్ పెట్టినట్లు చెబుతున్నారు. త్రివిక్రమ్ తీసిన ‘అతడు’, ‘అత్తారింటికి దారేది’ అతడి కెరీర్లో మైలురాళ్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘అ’తో మొదలయ్యే టైటిల్ మరోసారి కలిసొస్తుందని భావిస్తున్నాడట. ఇదే టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ‘దువ్వాడ జగన్నాథం’ తర్వాత పూజా హెగ్డే బన్నీతో మరోసారి జత కడుతోంది. త్రివిక్రమ్ గత చిత్రం ‘అరవింద సమేత’కు సంగీతం సమకూర్చిన తమనే ఈ చిత్రానికి కూడా పని చేయబోతున్నాడు. పి.ఎస్.వినోద్ ఛాయాగ్రహణం అందిస్తున్నాడు. దసరాకు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది ప్లాన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English