మజిలీ చేరుకోలేకపోయిన నాగ చైతన్య

మజిలీ చేరుకోలేకపోయిన నాగ చైతన్య

నాగచైతన్య కోరుకుంటోన్న విజయాన్ని మజిలీ అందించింది కానీ తొలి వారం వసూళ్లు చూసి అది చేరుతుందని భావించిన కొన్ని మజిలీలు మాత్రం చేరలేకపోయింది. యుఎస్‌లో ఈ చిత్రం ఖచ్చితంగా నాగచైతన్య సోలో హీరోగా నటించిన సినిమాల్లో అత్యధిక గ్రాస్‌ సాధిస్తుందని అనిపించింది. నిజానికి తొలి వారంలో ఊపు చూసి మిలియన్‌ డాలర్లు ఖాయమని కూడా అనేసుకున్నారు. కానీ తొలి వారాంతం తర్వాత బాగా నెమ్మదించిన మజిలీ రెండవ వారాంతంలో కూడా పికప్‌ అవలేదు. దీంతో రెండవ వారాంతంలో అత్తెసరు వసూళ్లు మాత్రమే వచ్చాయి.

మిలియన్‌ డాలర్లు కాకపోయినా ప్రేమమ్‌ వసూళ్లని అయినా దాటుతుందని అనుకుంటే అదీ కష్టమని తేలిపోయింది. మరో యాభై ఎనిమిది వేల డాలర్లు వస్తే తప్ప ఆ మజిలీ చేరడం కష్టం కాగా, డ్రాప్‌ తీవ్రంగా వుండడంతో అది జరగదనేది సుస్పష్టం. వచ్చే వారం జెర్సీ రిలీజ్‌ అవుతుంది కనుక మజిలీకి ఇక థియేటర్లు దొరికే ఛాన్స్‌ కూడా వుండదు. కనుక యుఎస్‌ వరకు మజిలీ రెండవ స్థానంతో సరిపెట్టుకోవాలి. ఓవరాల్‌ కలక్షన్ల విషయంలో మాత్రం 'రారండోయ్‌ వేడుక చూద్దాం' దాటి చైతూ సోలో సినిమాల్లో మజిలీ ప్రథమ స్థానం దక్కించుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English