ఆమె కొంప ముంచిన కడుపు!

ఆమె కొంప ముంచిన కడుపు!

2.0 ఫేమ్‌ ఏమీ జాక్సన్‌ గర్భవతి అయిన సంగతి తెలిసిందే. ఇంకా బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్‌ అయిన ఏమీ ప్రస్తుతం మిగతా సెలబ్రిటీల మాదిరిగా తన గర్భం తాలూకు ఫోటోలని ఇంటర్నెట్‌లో పెడుతూ హల్‌చల్‌ చేస్తోంది. 2.0 రిలీజ్‌ వరకు వేచి చూసిన ఈ బ్రిటిష్‌ సుందరికి ఆ చిత్రంతో ఆశించిన ఫలితం దక్కలేదు. 2.0 పెద్ద హిట్టయితే తన కెరియర్‌ మలుపు తిరుగుతుందని ఏమీ ఆశించింది. అందుకే ఆ చిత్రం విడుదలయ్యే వరకు ఓపిగ్గా చూసింది. కానీ అది తనకి అంతగా పేరు తీసుకురాకపోవడంతో ఇక అవకాశాలు రావని బాయ్‌ఫ్రెండ్‌తో తన మజిలీని మరో లెవల్‌కి తీసుకెళ్లడానికి డిసైడ్‌ అయింది.

అయితే ఈ క్రమంలో ఆమె 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో నటించే అవకాశం కోల్పోయిందట. ఏమీకి 2.0తో దేశవ్యాప్తంగా వచ్చిన గుర్తింపు దృష్ట్యా, ఈ చిత్రంలో విదేశీ హీరోయిన్‌ అవసరమైన సందర్భంలో ఆమె అయితే ఎలా వుంటుందని అనుకున్నారట. కానీ ఆమె ఇక నటించే ఆలోచనలో లేదని తెలుసుకుని వేరే ఆప్షన్లు చూసారట. పెళ్లి సంగతి ఎలా వున్నా కనీసం తన గర్భాన్ని కొన్నాళ్లు వాయిదా వేసుకున్నా ఏమీకి అంత పెద్ద మల్టీస్టారర్‌లో నటించే అవకాశం వచ్చి వుండేది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English