చిత్రలహరి... సగానికి పడింది!

చిత్రలహరి... సగానికి పడింది!

ఆరు ఫ్లాప్‌ల తర్వాత వచ్చిన చిత్రలహరి బాగా ఆడుతోందని సాయి తేజ్‌ ఆనందం పట్టలేకపోతున్నాడు. మీడియాతో మాట్లాడుతూ పలుమార్లు ఎమోషనల్‌ అయిపోతున్నాడు. తనకి హిట్లు కొత్త కాకపోయినా కానీ ఎంతగా ఒత్తిడికి గురయ్యాడనేది అతడిని చూస్తేనే అర్థమవుతోంది. మూడు రోజుల్లో తొమ్మిది కోట్లకి పైగా షేర్‌ వసూలు చేసిన ఈ చిత్రం మిగతా మూడు కోట్లు సాధించడం అంత కష్టమేమీ కాదు. ఇకనుంచి వసూళ్లు డ్రాప్‌ అయినా కానీ కమర్షియల్‌గా హిట్టయిపోతుంది. కాకపోతే ఇది తేజ్‌ మార్కెట్‌ని మునుపటి లెవల్‌కి తీసుకెళ్లిందా?

తేజ్‌ సినిమాలు ఇరవై ఏడు కోట్ల బిజినెస్‌ చేసిన హిస్టరీ కూడా వుంది. కానీ ఈ చిత్రానికి అందులో సగం బిజినెస్‌ జరిగింది. చిత్రలహరితో ఆ రికవరీకి ఢోకా లేదు కానీ తేజ్‌ మునుపటి స్థాయి మార్కెట్‌ని రీచ్‌ అవడం మాత్రం అసాధ్యమే అనాలి. మరి సగానికి పడిపోయిన ఈ మార్కెట్‌కి లోబడి ఇకపై చేసే సినిమాలని ఇంతకే పరిమితం చేస్తాడా లేక మళ్లీ పాతిక కోట్ల మార్కెట్‌ని టార్గెట్‌ చేసే సినిమా చేస్తాడా? తేజ్‌ మలి చిత్రానికి మారుతి దర్శకుడు కనుక దానికి అతని బ్రాండ్‌ కలిసి వచ్చి పాతిక కోట్ల బిజినెస్‌ అయితే సునాయాసంగా జరుగుతుంది. కాకపోతే అప్పుడు కూడా చిత్రలహరి రేంజ్‌ సినిమానే వస్తే మాత్రం సరిపోదది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English