బెల్లంకొండకి మళ్లీ బంపర్‌ సేల్‌

బెల్లంకొండకి మళ్లీ బంపర్‌ సేల్‌

బెల్లంకొండ శ్రీనివాస్‌కి హిట్లు లేకపోవచ్చు. కానీ అతని సినిమాలకి బిజినెస్‌ మాత్రం భలేగా జరుగుతుంటుంది. అందుకేనేమో అతనితో సినిమాలు తీయడానికి నిర్మాతలు బారులు తీరుతూ వుంటారు. అతని గత చిత్రం కవచం దారుణంగా ఫ్లాప్‌ అయినా కానీ తాజా చిత్రం 'సీత'కి పద్ధెనిమిది కోట్ల బిజినెస్‌ జరిగింది. మెగాస్టార్‌ మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ చిత్రాలకి కూడా ఇప్పుడింత గిరాకీ లేదు.

అతని ఖాతాలో రెండు హిట్లున్నా కానీ బిజినెస్‌ విషయంలో బెల్లంకొండలా కన్సిస్టెన్సీ లేదు. తేజ గత చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' హిట్టవడంతో పాటు కాజల్‌ అగర్వాల్‌ టైటిల్‌ రోల్‌ చేసిన 'సీత' పట్ల ట్రేడ్‌ వర్గాల్లో బలమైన నమ్మకం ఏర్పడింది. ఏప్రిల్‌ 25న విడుదల కానున్న సీతకి అటు, ఇటు గట్టి పోటీనే వుంది. అయినా కానీ దీనికి ఎలాంటి ఢోకా వుండదని బయ్యర్లలో నమ్మకం వ్యక్తమవుతోంది. ఇండస్ట్రీ నుంచి కూడా సీతకి మంచి రిపోర్ట్స్‌ వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కథ, కాజల్‌ పాత్ర ఖచ్చితంగా మహిళలని, మాస్‌ని ఆకట్టుకుంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో బాగా వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English