బన్నీని చూస్తే సందేహం వస్తోంది....

బన్నీని చూస్తే సందేహం వస్తోంది....

బన్నీ మాత్రం రికార్డుల గురించి అస్సలు ఆలోచిస్తున్నట్లు లేడు.. సినిమా వస్తుందా లేదా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తుందా లేదా. అన్నదే ముఖ్యం..అంటున్నాడు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో బన్ని హీరోగా ‘ఇద్దరమ్మాయిలతో’ అన్నిపనులు పూర్తి చేసుకుని, ఈ నెల 31న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజులే రిలీజ్‌కి మిగులున్నా.. బన్ని  ఈ సినిమా గురించి చేసిన ప్రచారం చాలా తక్కువ. సినిమా విశేషాలు, హైలైట్స్‌ గురించి ఎక్కడా ప్రస్థావించింది కూడా లేదు. పూరి  కమర్షియల్‌ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు. ఈ సినిమాని బాగా తీశాడు.  నమ్మకమే మా సినిమాని ముందుకి నడిపిస్తుంది..అనేస్తున్నాడు.

టాలీవుడ్‌లో స్టార్ల మధ్య రేస్‌ ప్రత్యక్షంగానే నడుస్తున్న కాలమిది. మహేష్‌, పవన్‌, చరణ్‌, బన్ని, ప్రభాస్‌... వీరి సినిమాలు రిలీజవుతున్నాయంటే అభిమానుల్లో విపరీతమైన క్రేజు. రికార్డులకు సంబంధించిన చర్చలు షరా మామూలుగానే జరుగుతాయి. వీటన్నిటినీ విస్మరించి బన్ని చాలా కూల్‌గా ఉండడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎవరికైనా. అదే టైములో అసలు సినిమా రిజల్ట్‌పైన మనోడికి ధీమాలేకనే ఇలా చేస్తున్నాడా అని కూడా అనిపిస్తుంది. మరో రెండు రోజుల్లో అసలు విషయం తెలిసిపోతుంది లేండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు