ముసలోడిగా సల్మాన్.. పిక్ వైరల్

ముసలోడిగా సల్మాన్.. పిక్ వైరల్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వయసు ఫ్రస్తుతం 53 ఏళ్లు. ఒక సాధారణ వ్యక్తి ఈ వయసుకు వస్తే వృద్ధాప్యంలో పడుతున్నట్లు భావిస్తారు. కానీ సినిమా హీరోలు మాత్రం ఎంత వయసు పెరిగినా కుర్రాళ్లే. తెరపై పిల్లల తండ్రుల పాత్రలు చేయడానికి కూడా సంశయిస్తుంటారు. పడుచు హీరోయిన్ల పక్కన డ్యూయెట్లు వేసుకుంటూ ఉంటారు. నడి వయసు, వృద్ధ పాత్రలు చేయడానికి వెనుకంజ వేస్తారు.

సల్మాన్ ఖాన్ ఈ కోవకు చెందినవాడే. తెరపై అతనెప్పుడూ వయసు మళ్లిన పాత్రలు చేయడు. యువకుడిగా, పెళ్లయిన భర్తగా మాత్రమే దర్శనమిస్తాడు. దాదాపుగా ప్రతి సినిమాలోనూ సల్మాన్ లుక్ కూడా ఒకే రకంగా ఉండి చాలా బోరింగ్‌గా అనిపిస్తుంటుుంది. ఆమిర్ ఖాన్‌లా, షారుఖ్ ఖాన్‌లా సల్మాన్ అవతారాలు మార్చడం అరుదు. ఐతే తన కొత్త సినిమా ‘భారత్’ కోసం మాత్రం అతను రూటు మార్చాడు.

తాజాగా ‘భారత్’ చిత్రం నుంచి సల్మాన్ కొత్త లుక్ లాంచ్ చేశారు. అందులో నెరిసిన జుట్టు, గడ్డంతో సల్మాన్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇది చూసి అభిమానులతో పాటు అందరూ షాకవుతున్నారు. సల్మాన్ ఏంటి ఇలాంటి లుక్ ఏంటి అంటున్నారు. ఎట్టకేలకు సల్మాన్ తన వాస్తవ వయసులోకి వచ్చాడా.. అతడికి ఇప్పటికి వయసు మళ్లిందా అని కౌంటర్లు కూడా వేస్తున్నారు.

ఈ చిత్రంలో సల్మాన్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రిలీజ్ చేసింది తండ్రి పాత్ర లుక్కే అయ్యుండొచ్చు. ఇంతకుముందు సల్మాన్‌తో ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ లాంటి సూపర్ హిట్లు అందించిన అలీ అబ్బాస్ జాఫర్ ‘భారత్‌’ను రూపొందించాడు. కొన్ని నెలల కిందట వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. సినిమా కూడా మెప్పిస్తుందని ఆశిస్తున్నారు. ఎప్పట్లాగే రంజాన్ పండక్కే సల్మాన్ బెర్తు బుక్ చేసుకున్నాడు. జూన్ 5న ఈ చిత్రం ప్రేక్షకలు ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English