పవన్‌ను తిట్టాడు.. చిరుతో పొగిడించుకున్నాడు

పవన్‌ను తిట్టాడు.. చిరుతో పొగిడించుకున్నాడు

గతంలో మెగా ఫ్యామిలీకి చాలా సన్నిహితంగా ఉండేవాడు పోసాని కృష్ణమురళి. చిరు మీద ఎంతో అభిమానం ప్రదర్శించే పోసాని.. ఆయన పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో కూడా చేరడం, ఎమ్మెల్యేగా పోటీ చేయడం తెలిసిన సంగతే. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఫెయిలయ్యాక చాలామంది చిరుకు దూరమైనా.. పోసాని మాత్రం ఆయన వెంటే ఉన్నాడు. అలా చిరుకు మరింత సన్నిహితంగా మారాడు.

అలాంటి వాడు చిరు తమ్ముడు పెట్టిన జనసేనకు దూరంగా ఉన్నాడు. పవన్‌ను సైతం వ్యతిరేకించాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆయన.. ఇటీవల పవన్ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. పవన్ మూడు పెళ్లిళ్ల విషయాన్ని తప్పుబడుతూ పోసాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మెగా అభిమానులకు ఆయనపై వ్యతిరేక భావం ఏర్పడింది.

కానీ ఇప్పుడు పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సినిమాలో పోసాని అత్యంత కీలక పాత్ర చేశాడు. తేజుకు గొప్ప ఊరటనిస్తున్న ‘చిత్రలహరి’ విజయంలో పోసాని పాత్ర ప్రధానం. ఇందులో హీరో పాత్ర కంటే కూడా తండ్రి పాత్ర ప్రేక్షకులకు అమితంగా నచ్చుతోంది. థియేటర్ల నుంచి బయటికి వచ్చాక కూడా వెంటాడే పాత్రల్లో అదొకటి. ఫెయిల్యూర్లతో పోరాడుతున్న కొడుక్కి అండగా నిలిచి, అతడిని ప్రోత్సహించే పాత్రలో పోసాని గొప్పగా నటించాడు. ఆ పాత్ర భలేగా పేలింది. తండ్రీ కొడుకులుగా పోసాని-తేజుల కెమిస్ట్రీ సినిమాలో బాగా పండింది.

ఈ పాత్ర విషయంలో అందరూ పోసానిని పొగుడుతున్నారు. తేజు ఈ విషయంలో చాలా ఎగ్జైట్ అయ్యాడు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సైతం ‘చిత్రలహరి’ గురించి స్పందిస్తూ పోసాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఆయన అద్భుతంగా నటించాడని అన్నారు. మొత్తానికి కొన్ని రోజుల ముందు రాజకీయంగా పవన్‌ను తిట్టి మెగా అభిమానుల్లో వ్యతిరేకత ఎదుర్కొన్న పోసాని.. ఇప్పుడు సినిమా పరంగా మెగా ఫ్యామిలీతో పొగిడించుకుంటుండం విశేషమే.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English