కాజల్ గ్లామరే కాపాడాలి

కాజల్ గ్లామరే కాపాడాలి

హిట్టు కోసం దాదాపు దశాబ్దంన్నర పాటు పోరాడాడు తేజ. చివరికి ‘నేనే రాజు నేనే మంత్రి’తో అతడి ఆశ ఫలించింది. ఈ సినిమా పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సక్సెస్ తేజకు ఎంత పెద్ద ఊరటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆయన కొత్త సినిమా ‘సీత’లో మాత్రం హిట్టు కళ కనిపించడం లేదు. ‘నేనే రాజు నేనే మంత్రి’ ప్రోమోల్లో కనిపించిన స్పార్క్ ‘సీత’లో కనిపించడం లేదు. దీని టీజర్‌ ప్రేక్షకుల్లో ఏమాత్రం ఆసక్తి రేకెత్తించలేకపోయింది.

ఒక హిట్ తర్వాత తేజ తీసిన సినిమా కావడం, కాజల్ కథానాయికగా నటించడంతో ‘సీత’కు ముందు ఓ మోస్తరుగా బజ్ కనిపించింది. టీజర్ రిలీజయ్యాక అది మరింత పెరుగుతుందనుకుంటే కథ అడ్డం తిరిగింది. ఉన్న బజ్ కూడా పోయింది. ఈ నెల 25కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు కానీ.. సినిమాకు బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగట్లేదని సమాచారం.

దర్శకుడు తేజ కానీ.. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కానీ ఈ సినిమాకు ప్లస్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. టీజర్లో వీళ్లిద్దరూ తేలిపోయారు. ఇప్పుడు ఈ సినిమాను కాపాడగలిగే సత్తా ఉన్నది కాజల్‌కు మాత్రమే అన్నది స్పష్టం. హీరో కోసమో.. దర్శకుడి కోసమో జనాలు థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదు. కాజల్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. ఆమె గ్లామర్‌ను ఇష్టపడే రొమాంటిక్ ప్రియులు సినిమాపై ఓ కన్నేస్తారని చిత్ర బృందం ఆశిస్తోంది.

త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. అందులో కాజల్ గ్లామర్‌‌ను ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారట. అది వర్కవుటైతే బిజినెస్ విషయంలో ఏమైనా కదలిక ఉంటుందని.. ఓపెనింగ్స్ కూడా ఓ మోస్తరుగా వస్తాయని ఆశిస్తున్నారు. వరుస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఆయనకు ఈ సినిమా విజయవంతం కావడం చాలా అవసరం. ఆ మాటకొస్తే బెల్లంకొండ శ్రీనివాస్‌కు కూడా ఈ సినిమా సక్సెస్ కీలకం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English