సునీల్ హీరోగా రెండు సినిమాలు

సునీల్ హీరోగా రెండు సినిమాలు

కమెడియన్‌గా బ్రహ్మాండగా ఉన్న కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకున్నాడు సునీల్. హీరో వేషాలపై అతడి మోజు కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టేసింది. కామెడీ టచ్ ఉన్న హీరో వేషాలు వేసినంత వరకు బాగానే ఉంది కానీ.. మాస్, యాక్షన్, రొమాన్స్ అంటూ రెగ్యులర్ హీరోల తరహాలో ట్రై చేసేసరికి జనాలకు చిరాకొచ్చేసింది. వరుసగా అతడి సినిమాల్ని తిరస్కరించారు. ఇటు హీరోగా సెట్ అవగా.. కామెడీ ఇమేజ్ కూడా దెబ్బ తీసుకుని రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది సునీల్ పరిస్థితి.

హీరోగా ఎన్ని ఫెయిల్యూర్లు వస్తున్నా.. పంతానికి పోయి లీడ్ రోల్స్‌లోనే సినిమాలు చేస్తూ వచ్చాడు సునీల్. ఐతే ‘ఉంగరాల రాంబాబు’.. ‘2 కంట్రీస్’ లాంటి సినిమాలు మరీ దారుణమైన ఫలితాలు రాబట్టడంతో సునీల్ మారక తప్పలేదు. హీరో వేషాలకు స్వస్తి చెప్పేసి మళ్లీ కామెడీ రూట్లోకి వచ్చాడు. కానీ కమెడియన్‌గా కూడా అతను అలరించలేకపోతున్నాయి. అయినా అవకాశాలకు అయితే ఢోకా లేదు.

సరైన క్యారెక్టర్ పడితే కమెడియన్‌గా సునీల్ మళ్లీ కుదురుకోగలడనే అనుకుంటున్నారంతా. ఇలాంటి సమయంలో సునీల్ మళ్లీ తాను హీరోగా సినిమాలు చేస్తానని అంటుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. హీరోగా మీ కెరీర్‌కు తెర పడినట్లేనా అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. ‘‘హీరోగా ఇది వరకే రెండు సినిమాల కోసం అడ్వాన్సులు తీసుకున్నాను. ఆ సినిమాల్ని పూర్తి చేయడం నా బాధ్యత. అవి అయిపోతే.. హాస్య పాత్రలపైనే దృష్టిసారిస్తా’’ అని బదులిచ్చాడు సునీల్.

ఐతే అడ్వాన్సులు తీసుకున్నంత మాత్రాన సినిమాలు చేయాలనేమీ లేదు. హీరోగా సునీల్‌ను ఏమాత్రం అంగీకరించట్లేదు జనాలు. మార్కెట్ జీరో అయిపోయిన నేపథ్యంలో మళ్లీ హీరోగా ట్రై చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో అంచనా వేయలేని స్థితిలో ఏమీ లేడు సునీల్. అడ్వాన్సుల కోసం సినిమాలు చేస్తే నిర్మాతలకు తర్వాత వచ్చే నష్టాల సంగతేంటి? కాబట్టి సునీల్ పునరాలోచించుకుంటే బెటరేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English