రాజమౌళి వల్ల కానిది నాని వల్లవుతుందా?

రాజమౌళి వల్ల కానిది నాని వల్లవుతుందా?

సీక్రెట్ సూపర్ స్టార్ అని హిందీలో ఒక చిన్న సినిమా. చైనాలో విడుదలై ఏకంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. రూ.50 కోట్ల లోపు బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియాలో ఓ మోస్తరుగా ఆడిందంతే. కానీ చైనాలో మాత్రం అనూహ్యమైన వసూళ్లు రాబట్టింది. దీని తర్వాత ‘హిందీ మీడియం’ అనే చిన్న సినిమా సైతం చైనాలో వందల కోట్లు కొల్లగొట్టింది.

మంచి కంటెంట్ ఉండి సరిగా ప్రమోట్ చేసుకుంటే చైనాలో ఇండియన్ సినిమాలకు భారీ వసూళ్లే రాబట్టుకోవచ్చు. అక్కడి మార్కెట్‌ను ఎక్స్‌ప్లోర్ చేసే ప్రయత్నంలోనే ఉన్నారు బాలీవుడ్ ఫిలిం మేకర్స్. ఐతే ప్రాంతీయ భాషల సినిమాలు చైనా మార్కెట్‌పై దృష్టి పెట్టట్లేదు.

తెలుగు నుంచి ‘బాహుబలి’తో చైనా మార్కెట్‌ను కొల్లగొడదామని చూశారు కానీ పనవ్వలేదు. రెండు భాగాల్నీ అక్కడ భారీగానే రిలీజ్ చేశారు కానీ.. వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. వచ్చిందంతా రిలీజ్ ఖర్చులకే సరిపోయింది. ‘బాహుబలి’ లాంటి సినిమా వల్ల కానిది వేరే చిత్రాల వల్ల ఏమవుతుందని మన నిర్మాతలు చైనా మార్కెట్ మీద దృష్టిపెట్టలేదు. ఐతే ఇప్పుడు నాని నటించిన ‘జెర్సీ’ సినిమాను చైనాలో రిలీజ్ చేయాలని చూస్తుండటం విశేషం. ఈ విషయాన్ని ఇటీవలే నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా ధ్రువీకరించారు.

ఇండియన్ సినిమాల్లో భారీతనం ఉన్నవాటి కంటే ఎమోషనల్‌గా టచ్ చేసే సినిమాలు చైనాలో సక్సెస్ అవుతున్నాయి. సీక్రెట్ సూపర్ స్టార్, హిందీ మీడియం, భజరంగి భాయిజాన్ లాంటి సినిమాలు ఇలాగే విజయం సాధించాయి. మరి ‘జెర్సీ’ కూడా చైనాలో సక్సెస్ అయి తెలుగు సినిమాలకు అక్కడ గేట్లు తెరుస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English