మార్కెట్ జీరో అయిపోయిందిగా..

మార్కెట్ జీరో అయిపోయిందిగా..

‘జనతా గ్యారేజ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. ‘మనమంతా’ సినిమా ఆడకపోయినా అందులో ఆయన నటన మన ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ తర్వాత వచ్చిన లాల్ డబ్బింగ్ సినిమా ‘మన్యం పులి’ తెలుగులో సూపర్ హిట్టయింది. ‘కను పాప’ సైతం ఓ మాదిరిగా ఆడింది.

దీంతో మోహన్ లాల్ కొత్త సినిమాలపై ఇక్కడి బయ్యర్ల కన్ను పడింది. వరుసగా అతడి సినిమాల్ని రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. కానీ లాల్ క్రేజ్ ఎంతో కాలం నిలబడలేదు. ‘ఒడియన్’.. ‘పులి జూదం’ లాంటి సినిమాలు దారుణమైన ఫలితాలందించాయి. తాజాగా మోహన్ లాల్ నుంచి ‘లూసిఫర్’ అనే సినిమా వచ్చింది.

నటుడు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయింది. రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. కొంచెం లేటుగా తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేశారు. గత శుక్రవారమే మన ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఐతే సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ కొంచెం బాగానే ప్రమోట్ చేసి రిలీజ్ చేసినా కూడా దీన్ని మన ప్రేక్షకులు పట్టించుకోలేదు.

మలయాళంలో ఈ సినిమా ఎందుకాడిందో ఏమో కానీ.. రొటీన్ మాస్ మసాలా మూవీ అయిన ‘లూసిఫర్’ మన జనాలకు నచ్చలేదు. దీని గురించి అసలు డిస్కషనే లేదు. సినిమాకు రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తానికి చాలామంది పరభాషా కథానాయకుల్లాగే మోహన్ లాల్ తెలుగులో తనకు వచ్చిన మార్కెట్‌ను చేజేతులా దెబ్బ తీసుకున్నట్లే అన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English