ఎన్నెన్ని అవతారాలు బాబోయ్

ఎన్నెన్ని అవతారాలు బాబోయ్

పోయినేడాది ‘గ్యాంగ్’తో పలకరించాక ఇప్పటిదాకా సూర్య నుంచి కొత్త సినిమా రాలేదు. అతను ఏడాదికి పైగా గ్యాప్ తీసుకోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. ఐతే ఈ గ్యాప్‌ను కవర్ చేస్తూ ఈ ఏడాది మూడు సినిమాలతో పలకరించబోతున్నాడు సూర్య. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో అతను చేస్తున్న ‘ఎన్జీకే’ మే 31న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

దీని తర్వాత ఇంకో మూడు నెలలకే మరో సినిమాను థియేటర్లలోకి దించబోతున్నాడు సూర్య. అదే.. కాప్పన్. కె.వి.ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రమిది. దీని టీజర్ తాజాగా రిలీజైంది. ఇదొక స్పై థ్రిల్లర్. సూర్య టెర్రరిస్టులా కనపిస్తూనే దేశ రక్షణకు సాయపడే పాత్ర పోషించాడిందులో. వేషాలు మార్చే పాత్రలంటే సూర్యకు చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే.

గతంలో చాలా సినిమాల్లో అలాంటి క్యారెక్టర్లు చేశాడు. ఇందులో ఏకంగా అతను ఏకంగా ఏడు అవతారాల్లో దర్శనమివ్వడం విశేషం. టీజర్లో ఆ అవతారాలన్నీ కనిపించాయి. టీజర్ మొత్తం యాక్షన్ ప్యాక్డ్‌గా కనిపించింది. కె.వి.ఆనంద్ సినిమాలన్నీ ఈ తరహాలోనే ఉంటాయి. ఆద్యంతం ఉత్కంఠ రేపుతాయి. కొంచెం హడావుడి ఎక్కువగానే ఉంటుంది. ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన మంత్రి పాత్ర చేయడం విశేషం. ఇటీవలే పెళ్లాడిన ఆర్య, సాయేషా ఇందులో కీలక పాత్రల్లో ప్రేమజంటగా కనిపించడం విశేషం. సూర్యకు సినిమాలో హీరోయినే ఉన్నట్లుగా లేదు.

‘అత్తారింటికి దారేది’లో నటించిన బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఈ చిత్రంతోనే తమిళంలోకి అడుగుపెడుతున్నాడు. ఇంతకుముందు సూర్య-కె.వి.ఆనంద్ కాంబినేషన్లో వచ్చిన ‘వీడొక్కడే’ పెద్ద హిట్టవగా.. ‘బ్రదర్స్’ నిరాశ పరిచింది. మరి ‘కాప్పన్’ ఏమవుతుందో చూడాలి. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 30న రిలీజ్ కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English