ఆ కథనం తప్పు.. ఫ్రాన్స్ రాయబారి ఖండన

ఆ కథనం తప్పు.. ఫ్రాన్స్ రాయబారి ఖండన

పెను సంచలనంగా మారిన లీమాండె కథనాన్ని ఖండించారు భారత్ లోని ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జిగ్లర్. రఫెల్ కోసం రిలయన్స్ అనిల్ అంబానికి లబ్థి చేకూర్చినట్లుగా లీమాండె సంచలన కథనాన్ని ప్రచురించం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఖండనలు వెల్లువెత్తాయి. అటు రిలయన్స్.. ఇటు భారత రక్షణ రంగంతో పాటు ఫ్రాన్స్ కూడా ఈ కథనం తప్పని ప్రకటించాయి.

తాజాగా భారత్ లోని ఫ్రాన్స్ రాయబారి మాట్లాడుతూ.. లీమాండె కథనం పూర్తిగా తప్పని.. రిలయన్స్.. ఎఫ్ ఎల్ ఏజీ సంస్థ మధ్య కుదిరిన అవగాహన మేరకే పన్ను మినహాయింపులు లభించినట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందం చట్టాలకు.. పన్నుల శాఖ రూల్స్ కు లోబడి జరిగినట్లుగా వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదన్నారు.

వివాదాస్పద రాఫేల్ యుద్ధ విమానాల ఒప్పందానికి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యునికేషన్స్ అనుబంధ సంస్థకు ఫ్రాన్స్ లో రూ.1123 కోట్ల మేర పన్నులు రద్దు చేసినట్లుగా ఫ్రాన్స్ లో టాప్ మీడియా సంస్థల్లో ఒకటైన లీమాండె ఒక సంచలన కథనంలో పేర్కొంది. ఈ కథనం పెను సంచలనంగా మారిన నేపథ్యంలో ఫ్రాన్స్ రాయబారి ఖండించారు. తాజా ఖండన అనిల్ అంబానీకి కూసింత ఊరటగా మారుతుందని చెప్పక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English