బన్నీ కెరీర్లో తొలిసారి అట..

బన్నీ కెరీర్లో తొలిసారి అట..

ఏడాది పాటు అసలు సినిమానే మొదలు పెట్టకుండా ఖాళీగా ఉండిపోయిన అల్లు అర్జున్.. ఇప్పుడేమో దాదాపు ఏడాది వ్యవధిలో మూడు సినిమాలు పూర్తి చేయడానికి ప్రణాళికలు వేసుకున్నాడు. ఆల్రెడీ త్రివిక్రమ్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. దీన్ని రెండు మూడు నెలల్లోనే పూర్తి చేయాలన్నది బన్నీ ఆలోచన. ఇది పూర్తయిన వెంటనే సుకుమార్ సినిమాను మొదలుపెట్టేస్తున్నాడు. దాని స్క్రిప్టు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లే తెలుస్తోంది.

కాగా బన్నీ చడీచప్పుడు లేకుండా ఓకే చేసిన సినిమా ‘ఐకాన్’ బౌండ్ స్క్రిప్టుతో రెడీగా ఉంది. బన్నీ ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు ఈ చిత్రం పట్టాలెక్కేస్తుంది. ఈ సినిమాకు ఇప్పటికే ఒక ఆసక్తికర ప్రి లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. మొన్న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా అది రిలీజై జనాల్ని ఇన్‌స్టంట్‌గా ఆకట్టుకుంది.

ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర ప్రచారం నడుస్తోందిప్పుడు. బన్నీ ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నాడట. ఇన్నేళ్ల కెరీర్లో బన్నీ ఎప్పుడూ డ్యూయల్ రోల్ చేయలేదు. ఈ రోజుల్లో స్టార్ హీరోలు ద్విపాత్రాభినయంపై అంతగా ఆసక్తి చూపించట్లేదు. ఇప్పుడది ట్రెండ్ కాదు. ఐతే దర్శకుడు వేణు శ్రీరామ్ ఒక చమక్కుతో ఇందులో హీరో ద్విపాత్రాభినయాన్ని డిజైన్ చేశాడట.

సినిమాలో కొత్త పాయింట్ అదే అని.. చాలా ఎంటర్టైనింగ్‌గా ఉండేలా డ్యూయల్ రోల్ ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. వేణు శ్రీరామ్ తొలి రెండు చిత్రాల్ని నిర్మించిన దిల్ రాజే ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ఇందులో ఓ బాలీవుడ్ కథానాయికగా బన్నీతో జత కడుతుందని సమాచారం. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది. వచ్చే దసరాకు రిలీజ్ చేయాలన్నది ప్లాన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English