జస్ట్ హిట్ కాదు.. బ్లాక్ బస్టరే

 జస్ట్ హిట్ కాదు.. బ్లాక్ బస్టరే

‘మజిలీ’ సినిమా రిలీజవుతుంటే అక్కినేని నాగచైతన్య, సమంతల జోడీ చాలా ఉత్కంఠగా ఎదురు చూసింది. దీనికి ముందు చైతూ నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అతడి మార్కెట్ దెబ్బ తినేసింది. దీంతో ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో.. వసూళ్లు ఎలా ఉంటాయో.. బయ్యర్ల పెట్టుబడి రికవర్ అవుతుందో లేదో అన్న సందేహాలు కలిగాయి. ఈ చిత్రానికి టాక్ మరీ అంత గొప్పగా ఏమీ రాలేదు.

చూసిన వాళ్లంతా పర్వాలేదన్నారంతే. దీంతో సినిమా బ్రేక్ ఈవెన్‌కు వస్తుందో లేదో అని ట్రేడ్ పండితులు కూడా అనుమానించారు. కానీ ఈ చిత్రం అందరి అనుమానాల్ని పటాపంచలు చేసింది. టాక్‌ను మించి వసూళ్లు రాబట్టింది. ఐదో రోజే బ్రేక్ ఈవెన్ సాధించి.. లాభాల బాట పట్టింది. తొలి వారంలో ‘మజిలీ’ రూ.25 కోట్లకు పైగా షేర్ రాబట్టడం విశేషం. రూ.21 కోట్లకే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది.

తొలి వారం ముగిసేసరికే రూ.4 కోట్ల లాభంలో ఉన్న ‘మజిలీ’ రెండో వీకెండ్లో అదరగొడుతోంది. ఈ చిత్రానికి శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఈ వారం వచ్చిన ‘చిత్రలహరి’కి దీటుగా.. కొన్ని చోట్ల దానికి మించి వసూళ్లు రాబట్టింది ‘మజిలీ’. రెండో వారంలోనూ ఒక కొత్త సినిమా స్థాయిలో ఇది అదరగొడుతోంది. దాదాపుగా రిలీజైన అన్ని థియేటర్లలోనూ ఈ చిత్రం కంటిన్యూ అవుతోంది. సెకండ్ వీకెండ్ అయ్యేసరికి ‘మజిలీ’ రూ.30 కోట్ల షేర్ క్లబ్బులోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఫుల్ రన్లో రూ.35 కోట్ల మార్కును కూడా అందుకునే అవకాశముంది. పెట్టుబడి మీద 50 శాతం లాభం అంటే ‘మజిలీ’ కేవలం హిట్ కాదు.. బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. ఈ చిత్రం శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలోనూ నిర్మాతలకు మంచి ఆదాయం తెచ్చి పెట్టింది. మొత్తంగా ఈ సినిమా అందరికీ సంతోషాన్నే మిగిల్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English