మ్యూజిక్ డైరెక్షన్... తప్పు చేశానంటున్న లారెన్స్

మ్యూజిక్ డైరెక్షన్... తప్పు చేశానంటున్న లారెన్స్

డ్యాన్సర్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి.. నృత్య దర్శకుడిగా రాఘవ లారెన్స్.. ఆ తర్వాత హీరోగా మారుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఇతను హీరో ఏంటి అన్నారు. కానీ అతను నటుడిగా తనేంటో రుజువు చేసుకున్నాడు. ఆపై లారెన్స్ దర్శకుడిగా మారుతుంటే జనాలు మరింతగా షాకయ్యారు. కానీ ఆ పాత్రలోనూ అతను సక్సెస్ అయ్యాడు.

దర్శకత్వం తర్వాత లారెెన్స్ మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేసి ఆశ్చర్యపరిచాడు. ఆ బాధ్యతల్లో అంతగా విజయం సాధించలేదు కానీ.. లారెన్స్ నేపథ్యం ప్రకారం చూస్తే ‘డాన్’.. ‘రెబల్’ లాంటి పెద్ద సినిమాలకు అతను సంగీతం అందించడం మాత్రం ఇప్పటికీ జనాలకు షాకే. కానీ ‘రెబల్’ తర్వాత మళ్లీ లారెన్స్ మ్యూజిక్ జోలికి వెళ్లలేదు. తాను మ్యూజిక్ డైరెక్షన్ చేయడం కరెక్ట్ కాదని అతను ఇప్పుడు రిగ్రెట్ అవుతుండటం గమనార్హం.

రాగాలు తెలిస్తే మ్యూజిక్ డైరెక్షన్ చేసేయొచ్చు అనే ఆలోచనతో తాను రెండు సినిమాలకు సంగీతం సమకూర్చినట్లు లారెన్స్ తెలిపాడు. కానీ దిగాక కానీ.. సంగీతం లోతెంతోో తెలియలేదని.. మ్యూజిక్ అనేది ఒక మహా సముద్రమని.. ఎంత నేర్చుకున్నా దానికి అంతం ఉండదని లారెన్స్ తెలిపాడు. రెండు సినిమాలకు సంగీతం సమకూర్చాక మళ్లీ ఆ పని చేయకూడదని అని తనకు అర్థమైందని.. దీంతో మళ్లీ సంగీతం జోలికి వెళ్లలేదని లారెన్స్ తెలిపాడు. దర్శకత్వం నేర్చుకోకపోయినా చేసేయొచ్చని.. కానీ సంగీతం అలా కాదని.. ఐతే అందులో బేసిక్స్ నేర్చుకుని పూర్తిగా పట్టు సాధించే ఓపిక లేక సంగీత దర్శకత్వాన్ని పక్కన పెట్టేశానని అన్నాడు.

ఇక తాను డైరెక్టర్ కావడం గురించి మాట్లాడుతూ.. ఒక కథ రాద్దాం అని కూర్చుంటే వరుసగా సీన్లు వాటంతట అవే రాసాగాయని.. ఆ తర్వాత ఆ సన్నివేశాల్ని తానైతేనే సరిగ్గా తెరకెక్కించగలననే నమ్మకంతో డైరెక్షన్‌లోకి దిగానని లారెన్స్ తెలిపాడు. ఐతే ఇప్పటికి కూడా నేను రైటరేంటి.. డైరెక్టరేంటి.. మనకు వీటికి ఏం సంబంధం అనే సందేహాలు తనకు వస్తుంటాయని లారెన్స్ చెప్పడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English