అవును.. మన్మథుడు-2లో నటిస్తున్నా

అవును.. మన్మథుడు-2లో నటిస్తున్నా

అక్కినేని నాగార్జునతో కలిసి ఇప్పటిే ‘మనం’, ‘రాజు గారి గది-2’ చిత్రాల్లో నటించింది. అందులో ఒకటి ఆయన కోడలు కాకముందు చేసింది.. ఒకటి కోడలయ్యాక చేసింది. ఇప్పుడు మరోసారి నాగార్జున చిత్రంలో సమంత నటిస్తున్నట్లుగా వార్తలొచ్చాయి ఇటీవల. నాగ్ కథానాయకుడిగా ఇటీవలే మొదలైన ‘మన్మథుడు-2’లో సమంత ప్రత్యేక పాత్ర చేస్తున్నట్లుగా రూమర్లు వినిపించాయి. ఐతే నాగ్ హీరోగా తెరకెక్కే రొమాంటిక్ మూవీలో సమంత నటించడం నిజమేనా అన్న సందేహాలు కలిగాయి.

ఐతే ఇప్పుడు స్వయంగా సమంతే తాను ‘మన్మథుడు-2’లో నటిస్తున్న విషయం నిజమే అని చెప్పింది. తన భర్త నాగచైతన్యతో కలిసి తాను నటించిన ‘మజిలీ’ విజయవంతంగా సాగిపోతున్న నేపథ్యంలో చైతూతో కలిసి మీడియాను కలిసిన సమంత.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ.. తాను ‘మన్మథుడు-2’లో నటిస్తు్న విషయం నిజమే అంది. కానీ ఆ పాత్ర వివరాలు చెప్పడానికి మాత్రం ఆమె ఇష్టపడలేదు.

‘మన్మథుడు-2’ దర్శకుడు రాహుల్ రవీంద్రన్.. సమంతకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. సమంత తొలి సినిమా ‘మాస్కోవిన్ కావేరీ’లో అతనే హీరో. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఉంది. తన ఫ్రెండ్ కోసం అతను ప్రత్యేక పాత్ర తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ‘మజిలీ’ కంటే ముందు తమిళంలో వచ్చిన సమంత సినిమా ‘సూపర్ డీలక్స్’ అద్భుతమైన స్పందన రాబట్టుకుంది. అందులో సామ్ పాత్ర షాకింగ్‌గా ఉంటుంది. ఆ సినిమా కథ, అందులో తన పాత్ర గురించి తన భర్తకు మొదటిసారి చెప్పినపుడు తన వైపు అదోలా చూశాడని... ‘‘ఇలాంటి సినిమా చేస్తున్నావా.. చెయ్ చెయ్’’ అన్నాడని.. ఇప్పుడు ఈ సినిమాకు వస్తున్న స్పందన పట్ల చైతూ చాలా సంతోషంగా ఉన్నాడని సమంత చెప్పింది. ‘మజిలీ’కి ముందు చైతూ చేసిన కొన్ని సినిమాల్లో అతడి పాత్రలు తనకు నిరాశ కలిగించాయని.. తనకు తెలిసిన స్పెషల్ చైతూ అందులో కనిపించలేదని.. ఐతే ‘మజిలీ’లో పూర్ణ పాత్ర అతడికి కరెక్టుగా సూటైందని సమంత అంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English