మహర్షి గాలి తీసేసాడు!

మహర్షి గాలి తీసేసాడు!

దేవిశ్రీప్రసాద్‌ ఇటీవల స్వరపరుస్తోన్న పాటలు విన్న మహేష్‌ అభిమానులు చాలా భయపడ్డారు. లైన్లో మహర్షి వుండడంతో దేవి ఇదే ఫామ్‌ కొనసాగిస్తే పాటలపై ఆశలు వదిలేసుకోవచ్చు అనుకున్నారు. మహర్షిలోని తొలి పాట చోటీ చోటీ బాతే ఫర్వాలేదనిపించింది. అయితే అది కూడా పెద్ద హిట్‌ కాలేదనేది దానికి వస్తోన్న స్పందన బట్టి అర్థమవుతోంది. ఈలోగా రెండవ పాటని విడుదల చేసారు. ఈ పాట అసలు మహర్షిలాంటి భారీ చిత్రానికి చేయాల్సిన పాటలా లేదని ఫాన్స్‌ మండిపడుతున్నారు.

భయపడ్డట్టుగానే దేవి ఈ చిత్రానికి అత్తెసరు పాటలు అందిస్తున్నాడని ఫాన్స్‌ అతడిని ట్యాగ్‌ చేసి మరీ తిడుతున్నారు. పైడిపల్లి వంశీకి గొప్ప మ్యూజిక్‌ టేస్ట్‌ లేదనేది అతని మునుపటి సినిమాల్లోని పాటలు వింటే అర్థమవుతుంది. కానీ మహేష్‌ ఇరవై అయిదవ చిత్రం కావడంతో సంగీతం బాగా అందిస్తాడని ఆశించారు. కానీ దేవి ఇంతవరకు ఈ చిత్రానికి సంబంధించి రేంజ్‌ పెంచే పాటని అయితే రిలీజ్‌ చేయలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English