యావరేజ్‌... కానీ కలక్షన్స్‌ కేక

యావరేజ్‌... కానీ కలక్షన్స్‌ కేక

వరుసగా ఆరు ఫ్లాప్‌లు చవిచూసిన సాయి ధరమ్‌ తేజ్‌కి ఎట్టకేలకు కాస్త ఉపశమనం లభించింది. అతని గత చిత్రాలతో పోలిస్తే 'చిత్రలహరి'కి డీసెంట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి. అతని గత రెండు చిత్రాల ఫలితాలు చూస్తే ఇక ప్రేక్షకులు తనని పట్టించుకోవడం లేదనే ఫీలింగ్‌ కలిగింది. కానీ 'చిత్రలహరి'కి టాక్‌ యావరేజ్‌గా వచ్చినా కానీ వసూళ్లు బాగున్నాయి. తక్కువ రేట్లకి అమ్మడం వల్ల ఈ చిత్రం ఈజీగా సేఫ్‌ అవుతుందని కూడా ట్రేడ్‌ చెబుతోంది. తన పేరులోంచి ధరమ్‌ తీసేసి సాయి తేజ్‌గా మారిన చిరంజీవి మేనల్లుడికి ఈ పేరు కలిసి వచ్చినట్టుగానే వుంది.

మొదటి ఆటతోనే ఇటీవలి తన సినిమాల ఫలితం ఏమిటనేది తేలిపోవడంతో కనీసం ప్రమోషన్స్‌ చేసుకునే వీలు కూడా దక్కలేదు. చిత్రలహరికి ప్రేక్షకుల నుంచి స్పందన బాగుండడంతో తేజ్‌ ప్రమోషన్స్‌తో సినిమాకి మరింత బూస్ట్‌ ఇస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్‌ స్వరపరిచిన పాటలు, విడుదలకి ముందు రేకెత్తించిన ఆసక్తి చిత్రలహరికి బోనస్‌గా మారాయి. మార్కెట్లో మజిలీ రూపంలో మరో ఆప్షన్‌ వున్నా కానీ చిత్రలహరి ఉనికి చాటుకోగలిగింది. అయితే వచ్చే వారం జెర్సీ రిలీజ్‌ అవుతోంది కనుక ఈలోగా సక్సెస్‌ తీరం చేరిపోతే బాగుంటుంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English