మహర్షి కోసం మూడేళ్లు.. మరి తర్వాత?

మహర్షి కోసం మూడేళ్లు.. మరి తర్వాత?

ఒక సినిమా విజయం సాధించి, ప్రశంసలు కూడా అందుకున్నాక ఏ దర్శకుడైనా తొందరపడతాడు. సాధ్యమైనంత త్వరగా తర్వాతి సినిమా చేయాలనుకుంటాడు. చకచకా సినిమాలు చేసుకుంటూ పోవాలనుకుంటాడు. కానీ వంశీ పైడిపల్లి మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించాడు. వంశీ చివరి సినిమా ‘ఊపిరి’ అతడికి ఎంత మంచి పేరు తెచ్చిందో తెలిసిందే. ఆ సినిమా ఒక రీమేక్ అయినా సరే.. దర్శకుడిగా వంశీ స్థాయిని పెంచింది. అతడిని టాప్ లీగ్‌‌లోకి తీసుకెళ్లింది. ఐతే ‘ఊపిరి’తో వచ్చిన పేరు చెడగొట్టుకోకూడదని చాలా టైం తీసుకుని మహేష్ బాబుతో తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించాడు వంశీ. ‘మహర్షి’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్‌తో మొదలుపెట్టి రిలీజ్ సమయానికి మూడేళ్లు పట్టింది.

ఎట్టకేలకు మే 9న ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని తర్వాత వంశీ సినిమా ఏంటి అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈసారి వంశీ రామ్ చరణ్‌తో జట్టు కట్టబోతున్నాడని వార్తలొస్తున్నాయి. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఎవడు’ హిట్టయింది. మళ్లీ ఈ కాంబినేషన్ అంటే మంచి అంచనాలుంటాయి. ఐతే చరణ్ ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’లో బిజీగా ఉన్నాడు. దాన్నుంచి బయటికి రావడానికి ఏడాది పైనే పడుతుంది. ఎలాగూ స్క్రిప్టు రెడీ చేసుకోవడంలో వంశీ స్లోనే కాబట్టి చరణ్ కోసమే ఆగి తన తర్వాతి సినిమాను అతడితోనే చేస్తాడని అనుకోవచ్చు. ఆ రకంగా చూస్తే తన తర్వాతి సినిమా కోసం కూడా కనీసం రెండేళ్లు వెచ్చించడం ఖాయం అన్నమాట. ఈ చిత్రాన్ని కూడా వంశీ ఫేవరెట్ ప్రొడ్యూసర్ దిల్ రాజే నిర్మిస్తాడని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English