వచ్చి వచ్చి విజయ్ మీద పడుతున్నారే..

వచ్చి వచ్చి విజయ్ మీద పడుతున్నారే..

వేసవిలో మంచి డేట్ ఎంచుకున్నా అని సంబరపడిపోయాడు విజయ్ దేవరకొండ. కానీ తమిళ స్టార్ హీరోలు ఒకరి తర్వాత ఒకరొచ్చి అతడికి అడ్డం పడిపోతున్నారు. విజయ్ కొత్త సినిమా ‘డియర్ కామ్రేడ్’ను మే 31 విడుదల చేయనున్నట్లు చాన్నాళ్ల కిందటే ప్రకటించిన సంగతి తెలిసిందే. దక్షిణాదిన నాలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది ప్లాన్. విజయ్‌కి దక్షిణాదిన అంతటా క్రేజ్ ఉంది. తమిళంలో అతడిని ఒక స్టార్ హీరోలా చూస్తున్నారు. ఆల్రెడీ అతను ‘నోటా’తో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫ్లాప్ అయినా తమిళనాట ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి. ‘డియర్ కామ్రేడ్’కు ఓపెనింగ్స్‌తో పాటు మంచి ఫలితమూ వస్తుందని అతను ఆశిస్తున్నాడు. ఐతే విజయ్ సినిమాకు డేట్ ఇచ్చాక మే 31కే ఇద్దరు తమిళ స్టార్ హీరోలు తమ సినిమాల్ని షెడ్యూల్ చేశారు.

ఆల్రెడీ సూర్య కొత్త చిత్రం ‘ఎన్జీకే’ను మే 31నే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. సూర్య సినిమా తమిళంలో భారీగా రిలీజవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో, కేరళ, కర్ణాటకల్లోనూ  అతడికి మంచి మార్కెట్ ఉండటంతో విజయ్ చిత్రానికి పోటీ తప్పదు. సూర్యతోనే కష్టమంటే.. మరో స్టార్ హీరో విక్రమ్ కూడా విజయ్‌కి పోటీగా తయారయ్యాడు. కమల్ హాసన్ నిర్మాణంలో అతను చేస్తున్న ‘కదరం కొండాన్’ కూడా మే 31నే రిలీజవుతున్నట్లు తాజాగా ప్రకటన వచ్చింది. ‘చీకటి రాజ్యం’తో దర్శకుడిగా పరిచయమైన రాజేష్ సెల్వ ఈ థ్రిల్లర్ మూవీని డైరెక్ట్ చేశాడు. ఇది ఓ ఫ్రెంచ్ మూవీకి రీమేక్. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో విజయ్‌కి సౌత్ మార్కెట్లలో ఇబ్బందికరమే. మరి ఈ పోటీ ఎందుకని విజయ్ డేట్ మార్చుకుంటాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English