వాటి మొత్తం వసూళ్లెంతో.. దీని తొలి రోజు వసూళ్లంత

వాటి మొత్తం వసూళ్లెంతో.. దీని తొలి రోజు వసూళ్లంత

సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ‘చిత్రలహరి’ అతడి చింత తీర్చేలాగే కనిపిస్తోంది. ఫుల్ రన్ వసూళ్ల సంగతేమో కానీ.. తొలి రోజు వరకు అయితే మాత్రం ఈ చిత్రం అంచనాల్ని మించి పోయింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే రూ.3 కోట్లకు పైగా షేర్ సాధించడం విశేషం. ఇదేమీ తేజు కెరీర్ హైయెస్ట్ ఏమీ కాదు కానీ.. ఇప్పుడు అతడి కెరీర్ ఉన్న స్థితిలో ఇది పెద్ద మొత్తమే.  

రెండేళ్ల కిందట ‘విన్నర్’ సినిమాకు తొలి రోజు రూ.5 కోట్లకు పైగా షేర్ వచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన తేజు సినిమాలే దారుణమైన ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి. ‘ఇంటిలిజెంట్’.. ‘తేజ్ ఐ లవ్యూ’ సినిమాలకు అందులో సగం ఓపెనింగ్స్ కూడా రాని పరిస్థితి. వాటి ఫుల్ రన్ వసూళ్లు రూ.4 కోట్లకు అటు ఇటుగా ఉండటం గమనార్హం. అంటే ఆ రెండు సినిమాల ఫుల్ రన్ వసూళ్లు ఎంత వచ్చాయో ‘చిత్రలహరి’ తొలి రోజు కలెక్షన్లు అంతే ఉండటం ఆశ్చర్యకరమైన విషయమే.

‘చిత్రలహరి’కి ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉండటం.. సమ్మర్ సీజన్లో రిలీజ్ కావడం బాగానే కలిసొచ్చినట్లుంది. అన్ని ఏరియాల్లోనూ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఈ చిత్రానికి యావరేజ్, అబోవ్ యావరేజ్ టాక్ వినిపించింది. సినిమా గొప్పగా చెప్పకున్నా నెగెటివ్‌గా అయితే ఎవరూ మాట్లాడట్లేదు. ‘చిత్రలహరి’పై బయ్యర్ల పెట్టుబడి మరీ భారీగా ఏమీ లేదు. వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి రూ.13 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

తొలి రోజు ఓపెనింగ్స్ ప్రకారం చూస్తే బ్రేక్ ఈవెన్‌కు రావడం అంత కష్టమేమీ కాకపోవచ్చు. వీకెండ్లో ఊపు కొనసాగితే రూ.10 కోట్ల మార్కుకు చేరువగా వచ్చే అవకాశముంది. ఆ తర్వాత వీక్ డేస్‌లో ఓ మాదిరిగా ఆడినా బయ్యర్ల పెట్టుబడులు వెనక్కి వచ్చేస్తాయి. వచ్చే వారం ‘జెర్సీ’ రాబోతున్న నేపథ్యంలో ఆలోపే సాధ్యమైనంతగా పెట్టుబడులు రికవర్ కావడం కీలకం.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English