ప్రభాస్ క్రేజ్ అలా ఉంది మరి

 ప్రభాస్ క్రేజ్ అలా ఉంది మరి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌ను ‘బాహుబలి’కి ముందు ‘బాహుబలి’కి తర్వాత అని విభజించి చూడాలి. బహుశా ఇండియాలో మరే హీరో కూడా ఒక సినిమాతో ఇంత క్రేజ్, ఇంత మార్కెట్ సంపాదించుకుని ఉండడంటే అతిశయోక్తి కాదేమో. ‘బాహుబలి’తో ఏకంగా అతడి మార్కెట్ పది రెట్లు కావడం అనూహ్యం. ఇక ప్రభాస్ క్రేజ్ గురించైతే చెప్పాల్సిన పని లేదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంటారు కదా.. అదే రకంగానే అతడి క్రేజ్ విస్తరించింది.

కోట్లాది మంది అతడి అభిమానులుగా మారిపోయారు. ప్రస్తుతం ప్రభాస్ గురించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. మామూలుగా ప్రభాస్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండడు. అయినా అక్కడ అతడి గురించి తరచుగా డిస్కషన్లు నడుస్తుంటాయి.

పెద్దగా అప్ డేట్స్ ఇవ్వకపోయినా సరే.. ఫేస్ బుక్‌లో ప్రభాస్‌కు కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం. తాజాగా ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టినట్లుగా చెబుతున్నారు. ‘actorprabhas’ అనే పేరుతో ఈ అకౌంట్ మొదలైంది. ఐతే అది నిజంగా ప్రభాస్‌దా కాదా అన్న క్లారిటీ లేదు. అందులో ప్రభాస్ ఫొటో లేదు. ఇంకే రకమైన పోస్టులు లేవు. ప్రొఫైల్ పిక్ ఖాళీగా ఉంది. కానీ ఇది ప్రభాస్ అకౌంటే అని నమ్మకంతో జనాలు వెంటనే దాన్ని అనుసరించడం మొదలుపెట్టారు.

కొన్ని గంటల్లోనే 7 లక్షల మందికి పైగా ఫాలోవర్లు జమ అయ్యారు. అసలిది నిజంగా ప్రభాస్ అఫీషియల్ అకౌంటా కాదా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే ప్రభాస్ పేరుతో చాలా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి. లక్షల మంది నెటిజన్లు వెరిఫై చేసుకోకుండా వాటిని అనుసరిస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్లలోనూ ఇదే పరిస్థితి. దీన్ని బట్టే ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందన్నది అర్థం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English