ఆర్ఎక్స్ 100 హీరో ఆ టైటిల్ పెట్టాడేంటి?

ఆర్ఎక్స్ 100 హీరో ఆ టైటిల్ పెట్టాడేంటి?

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో రాత్రి రాత్రి హీరో కార్తికేయ జాతకం మారిపోయింది. అంతకుముందు అతను ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే ఒక సినిమాలో నటించాడు. అది వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. కానీ ‘ఆర్ఎక్స్ 100’ మాత్రం సెన్సేషనల్ హిట్టయి అతడికి ఎక్కడ లేని గుర్తింపు తెచ్చింది. ఈ దెబ్బతో అతను కొన్ని నెలల్లోనే బిజీ హీరో అయిపోయాడు.

గతంలో సూర్యతో ‘నువ్వు నేను ప్రేమ’ సినిమా తీసిన టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో ‘హిప్పి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది త్వరలోనే విడుదలకు ముస్తాబవుతోంది. దీంతో పాటుగా కార్తికేయ ఇంకో రెండు మూడు సినిమాల్ని లైన్లో పెట్టాడు. అందులో నాని హీరోగా తెరకెక్కుతున్న ‘జెర్సి’ ఒకటి. అందులో కార్తికేయ విలన్ రోల్ చేస్తున్నాడు. దీంతో పాటుగా అర్జున్ జంధ్యాల, శేఖర్ రెడ్డి అనే ఇద్దరు కొత్త దర్శకులతో హీరోగా సినిమాలు కమిటయ్యాడు.

శేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ కార్తికేయ హీరోగా తెరకెక్కించనున్న సినిమాకు టైటిల్ కూడా ఖరారవడం విశేషం. దీనికి ‘90 ఎంఎల్’ అని పేరు పెట్టారు. ఐతే ఆల్రెడీ ఈ టైటిల్‌తో తమిళంలో ఓ సినిమా వచ్చింది. ‘బిగ్ బాస్’తో పాపులారిటీ సంపాదించుకున్న ఒవియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రమది. తమిళంలో వచ్చిన తొలి లేడీ ఓరియెంటెడ్ అడల్ట్ కామెడీ అది. సినిమా నిండా పచ్చి బూతులే. అమ్మాయిలు మందు కొట్టడం, అబ్బాయిలతో తిరగడం నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం తీవ్ర విమర్శలెదుర్కొంది. సినిమా ఎలా ఆడినప్పటికీ ఆ టైటిల్ బాగా పాపులర్ అయింది. వివాదాలకూ దారి తీసింది.

అలాంటి టైటిల్‌ను కార్తికేయ తన సినిమాకు పెట్టుకోవడం ఆశ్చర్యమే. ‘హిప్పి’తో తమిళంలోకి కూడా ఎంట్రీ ఇస్తున్న కార్తికేయ.. తన తర్వాతి సినిమాల్ని కూడా తమిళంలో రిలీజ్ చేసే అవకాశముంది. మరి ‘90 ఎంఎల్’ టైటిల్‌తో అక్కడికి వెళ్లడం కష్టం. మరి ఎందుకు ఈ టైటిల్ పెట్టుకున్నాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English