‘జెర్సీ’ చూస్తుంటే ‘మజిలీ’ గుర్తుకొస్తోందే..

‘జెర్సీ’ చూస్తుంటే ‘మజిలీ’ గుర్తుకొస్తోందే..

నేచురల్ స్టార్ నాని నుంచి రాబోతున్న కొత్త సినిమా ‘జెర్సీ’. ఈ నెల 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజే దీని థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు ఆద్యంతం ఆకట్టుకున్న ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాల్ని పెంచేసింది. క్రికెట్ నేపథ్యంలో తెలుగులో ఇలాంటి అథెంటిక్.. ఎమోషనల్ మూవీ అరుదనే చెప్పాలి. ఒక క్లాసిక్ లాగా నిలిచిపోయే లక్షణాలు ఈ సినిమాలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ట్రైలర్ వరకు ప్రతి అంశం ఆకట్టుకుంది. ఐతే ఇటీవలే విడుదలైన ‘మజిలీ’ సినిమాతో దీనికి పోలికలు కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయం.

‘మజిలీ’ ప్రధానంగా ప్రేమకథ. అందులో క్రికెట్ నేపథ్యం ఉంది. కానీ ‘జెర్సీ’ అలా కాదు. ఇది పూర్తి స్థాయిలో ఒక క్రికెటర్ కథ. క్రికెట్టే ఇక్కడ ప్రధానాంశం. ప్రేమకథ, కుటుంబ అంశాలు అందులో భాగం. ఐతే క్యారెక్టర్లు, సన్నివేశాల విషయంలో మాత్రం రెండు సినిమాల్లో పోలికలు కనిపిస్తున్నాయి.

యుక్త వయసులో క్రికెటర్ కావాలని కలలు కని ప్రేమ కారణంగా అది మధ్యలో దూరమై జీవితంలో ఎటూ కాకుండా పోయే కుర్రాడిగా కనిపించాడు ‘మజిలీ’లో హీరో. ‘జెర్సీ’లో సైతం హీరో క్రికెటరే. అతడికీ ఓ ప్రేమకథ ఉంటుంది. కానీ ప్రేమలో గెలుస్తాడు. క్రికెట్లో ఓడిపోతాడు. ఇక ‘మజిలీ’లో అతడిని ప్రేమించే భార్య ఉంటుంది. భర్తకు డబ్బుల్లేకుంటే పొద్దున ప్యాంటులో మరిచిపోయారంటూ అతడికి డబ్బులందజేస్తుంది. ‘జెర్సీ’లో దీనికి క్వయిట్ ఆపోజిల్ సీన్ ఉండటం విశేషం.

హీరో అంటే నచ్చని భార్య.. అతను తన పర్సులోంచి డబ్బు దొంగిలించడం చూసి అసహ్యించుకుంటుంది. ‘మజిలీ’లో హీరో మధ్య పెళ్లి తర్వాత కొన్నేళ్లకు కోచింగ్ ద్వారా క్రికెట్లోకి తిరిగొస్తాడు. అతడిలో ఓ చిన్న అమ్మాయి స్ఫూర్తి రగిలిస్తుంది. ‘జెర్సీ’లో హీరో మధ్య వయసులో మళ్లీ క్రికెట్ ఆడతాడు. కొడుకు కోసం అతను మళ్లీ తనేంటో రుజువు చేసుకోవాలనుకుంటాడు. ‘జెర్సీ’ ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇలా కొన్ని విషయాల్లో పోలికలు కనిపిస్తున్నాయి. ఐతే ఈ పోలికలు సినిమాలో పెద్ద సమస్య కాకపోవచ్చని అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English